iDreamPost
android-app
ios-app

ప్రముఖ నిర్మాత ఫరా ఖాన్ ఇంట తీవ్ర విషాదం!

  • Published Jul 26, 2024 | 4:48 PM Updated Updated Jul 26, 2024 | 4:48 PM

Farah Khan: ఇటీవల సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. పలు కారణాలతో సెలబ్రెటీలు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడంతో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోతున్నారు.

Farah Khan: ఇటీవల సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. పలు కారణాలతో సెలబ్రెటీలు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడంతో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోతున్నారు.

  • Published Jul 26, 2024 | 4:48 PMUpdated Jul 26, 2024 | 4:48 PM
ప్రముఖ నిర్మాత ఫరా ఖాన్ ఇంట తీవ్ర విషాదం!

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. వయోభారం, అనారోగ్య సమస్యలు, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం తీవ్ర విషాదంలోకి వెళ్తున్నారు. ఇటీవల కొంతమంది సెలబ్రెటీలు కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా బలవన్మరణానికి పాల్పపడుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత, నటి, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఫరా ఖాన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో నటి, నిర్మాత, కొరియోగ్రాఫర్ గా పాపులారిటీ తెచ్చుకున్నారు ఫరా ఖాన్. వెండి తెరపైనే కాదు బుల్లితెరపై పలు రియాల్టీ షోల్లో యాంకర్, జడ్జీగా వ్యవహరించారు. ఆమె కెరరీర్‌లో దాదాపు 80 సినిమాల్లో 100 పాటలకు నృత్య దర్శకురాలిగా పని చేసింది. కెరీర్ బిగినింగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఫరా ఖాన్ తర్వాత నృత్య దర్శకురాలిగా మారింది. ఆ తర్వాత నిర్మాతగా మారి పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. ఈమె నృత్య దర్శకత్వం వహించిన సాంగ్స్ బ్లాక్ బస్టర్ కావడమే కాదు.. నటీనటులకు మంచి పేరు తీసుకువచ్చింది. తాజాగా ఫరా ఖాన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి చికిత్స పొందుతూ కన్నుమూసిందని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ చేసింది.

సినీ నిర్మాత ఫరా ఖాన్ తల్లి మేనకా ఇరానీ (79) శుక్రవారం (జులై 26) హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల అంటే జులై 12న ఆమె పుట్టిన రోజు జరుపుకున్నారు. ఇదే నెలలో ఆమె తుదిశ్వాస విడిచారు.  అప్పుడు ఫరా ఖాన్ తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసిన పోస్ట్ తాజాగా వైరల్ అవుతుంది.   ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేస్తూ ‘ మనమందరం తల్లులను ఎంతో గొప్పగా చూసుకుంటాం. నేను మా అమ్మ మేనకాను ఎంతగానో ప్రేమించాను.. ఆమె ఆరోగ్యం బాగై ఇంటికి వస్తుందని భావించాను. కానీ నన్ను విడిచి వెళ్లిపోయింది.. ఐ లవ యూ ’ అంటు రాసుకొచ్చింది. ఫరా ఖాన్ తల్లి మేనకా ఇరాని  మరణంపై సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఫరా ఖాన్ కి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom