iDreamPost
android-app
ios-app

NTR అన్ లక్కీ బాస్.. అసలు ఏం జరిగిందంటే?

  • Published Oct 04, 2024 | 5:16 PM Updated Updated Oct 04, 2024 | 5:16 PM

Devara Success Meet: దేవరతో తారక్ థియేటర్స్ లో మాస్ జాతర చేస్తున్నాడు. ఇదంతా సరే తారక్ అభిమానులు సినిమాతో ఫుల్ శాటిస్ఫై అవుతున్నారు. కానీ వాళ్లలో ఎక్కడో ఓ దగ్గర కాస్త బాధ కూడా ఉంది. నిజంగా తారక్ ఫ్యాన్స్ అన్ ఆ ఒక్క విషయంలో అన్ లక్కీ నే.. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

Devara Success Meet: దేవరతో తారక్ థియేటర్స్ లో మాస్ జాతర చేస్తున్నాడు. ఇదంతా సరే తారక్ అభిమానులు సినిమాతో ఫుల్ శాటిస్ఫై అవుతున్నారు. కానీ వాళ్లలో ఎక్కడో ఓ దగ్గర కాస్త బాధ కూడా ఉంది. నిజంగా తారక్ ఫ్యాన్స్ అన్ ఆ ఒక్క విషయంలో అన్ లక్కీ నే.. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Oct 04, 2024 | 5:16 PMUpdated Oct 04, 2024 | 5:16 PM
NTR అన్ లక్కీ బాస్.. అసలు ఏం జరిగిందంటే?

ఎంతైనా తారక్ అభిమానులు, తారక్ ఇద్దరూ చాలా అన్ లక్కీ. అదేంటి, నిన్న మొన్నటివరకు చొక్కాలు చించేసుకునేలా గోల చేశారు. మా బాస్ మమ్మల్ని కాలర్ ఎగరేసుకునేలా చేశాడు అన్నారు. ఆహా ఓహో నిన్ను కొట్టేవాడు లేడంటూ.. తారక్ ను అందాలన్నీ ఎక్కించారు. ఎన్టీఆర్ ఆ మజాకానా అన్నారు. సడెన్ గా అన్ లక్కీ ఎందుకు అయ్యారు. పైగా పదేళ్ల నుంచి మ్యాన్ ఆఫ్ ది మాసెస్ హిస్టరీలో ఒక్క ప్లాప్ కూడా లేదు. ఇప్పుడు మరోసారి దేవరతో ఫ్యాన్స్ కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ కూడా ఇచ్చాడు కదా.. మరి ఇంకా అన్ లక్కీ ఏంటి అనుకుంటున్నారా. నిజమే ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో తారక్ లక్కీనే. ఎంత లక్ అంటే ప్లాప్ డైరెక్టర్స్ కు కూడా హిట్స్ ఇచ్చేంత లక్. సుడి మాములుగా లేదు. రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు. కానీ ఆ ఒక్క విషయంలో తప్ప. అదేంటో చూసేద్దాం.

ఏ అభిమానికైనా తన ఫేవరేట్ స్టార్ ను కనీసం ఓసారైన చూడాలనే కోరిక ఉంటుంది. అలాగే స్టార్స్ కు సరదాగా కాసేపు అభిమానులతో ముచ్చటించాలని ఉంటుంది. అప్పుడే కదా ఫ్యాన్స్ కు ఏం కావాలో తెలుసుకుంటారు. పైగా వారిని చూసినప్పుడు ఫ్యాన్స్ చేసే హడావిడి.. స్టార్స్ కు మంచి బూస్ట్ అప్ ఇస్తుంది. సాధారణంగా అందరి హీరోల సినిమాలలో ఇది జరుగుతూనే ఉంటుంది. మూవీ రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లు , ప్రెస్ మీట్ లు రిలీజ్ తర్వాత 100 డేస్ సెలెబ్రేషన్లు , సక్సెస్ మీట్ లు.. అబ్బో ఒకటా రెండా లెక్కలేనన్ని ఈవెంట్స్ జరుగుతాయి. కానీ దేవర విషయంలో మాత్రం అభిమానుల ఆశలు , కోరికలు నీరు కారిపోయాయి. రిలీజ్ కు ముందు అవుట్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు. సరే అవుట్ డోర్ క్యాన్సిల్ చేసినా కనీసం ఈవెంట్ అయినా జరుగుతుందిలే.. అనుకుని ఎక్కడెక్కడి నుంచో ఫ్యాన్స్ వచ్చారు. తీరా వచ్చాక క్రౌడ్ ఎక్కువ ఉందని అది కూడా క్యాన్సిల్ చేశారు.

దీనితో అభిమానులు ఆగ్రహంతో రచ్చ రచ్చ చేయడం, మూవీ టీమ్ క్షమాణపన చెప్పడం అంతా జరిగిపోయింది. అయినా సరే మూవీని మాత్రం గ్రాండ్ సక్సెస్ చేశారు. నిజంగా తారక్ మీద ఫ్యాన్స్ కు ఉన్న అభిమానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇంత జరిగాక కూడా మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేయడం గొప్ప విషయమే. సరే మూవీ అనుకున్న దానికంటే ఒకింత ఎక్కువగానే సక్సెస్ అందుకుంది. కనీసం సక్సెస్ మీట్ అయినా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు అభిమానులు. కానీ ఇక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. దేవి నవరాత్రుల కారణంగా సక్సెస్ మీట్ కు పర్మిషన్స్ దొరకడంలేదని వెల్లడించారు మేకర్స్. అయితే అనుమతి కోసం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు టాక్. మరి ఈసారైనా అటు తారక్ కోరిక, ఇటు అభిమానుల కోరిక తీరుతుందేమో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabet