iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌ హౌస్‌లో గొడవ.. విడాకులు తీసుకోనున్న స్టార్‌ కపుల్‌!

  • Published Nov 14, 2023 | 11:40 AM Updated Updated Nov 14, 2023 | 11:40 AM

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలకంటే.. గెలుపు, మైండ్‌ గేమ్‌ ఎక్కువగా కనిపిస్తుంటే.. గెలవాలన్న కసి తప్ప.. ఎదుటి వ్యక్తి మీద సింపథీ అస్సలు ఉండదు.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలకంటే.. గెలుపు, మైండ్‌ గేమ్‌ ఎక్కువగా కనిపిస్తుంటే.. గెలవాలన్న కసి తప్ప.. ఎదుటి వ్యక్తి మీద సింపథీ అస్సలు ఉండదు.

  • Published Nov 14, 2023 | 11:40 AMUpdated Nov 14, 2023 | 11:40 AM
బిగ్‌బాస్‌ హౌస్‌లో గొడవ.. విడాకులు తీసుకోనున్న స్టార్‌ కపుల్‌!

ఎక్కడో నెథర్లాండ్‌లో పుట్టిన బిగ్‌బాస్‌ షో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ ఫేమస్‌ అయిపోయింది. ఇండియాలో బిగ్‌బాస్‌ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. వరుస సీజన్లతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇండియాలో 2006లో  ప్రారంభమై.. ఇప్పుడు అన్ని భాషల్లోకి విస్తరించింది. తెలుగులో ప్రస్తుతం సీజన్‌ 7 నడుస్తోంది. హిందీలో సీజన్‌ 17 నడుస్తోంది.  మిగిలిన భాషల్తో పోల్చుకుంటే హిందీ బిగ్‌బాస్‌ అగ్రెసివ్‌గా సాగుతోంది.

ఒక సీజన్‌ను మించి మరో సీజన్‌ రేటింగ్‌లో పోటీ పడుతున్నాయి. వివాదాలు, విమర్శలకు సైతం కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఈ షోలోకి వచ్చిన తర్వాత మంచి మిత్రులైన వారు కొందరైతే.. మిత్రులుగా షోలోకి వచ్చి గొడవలు పడి విడిపోయిన వారు మరికొందరు. మైండ్‌ గేమ్‌ కారణంగా ప్రాణ స్నేహితుల మధ్య కూడా గొడవలు తప్పటం లేదు. ఇప్పుడీ పరిస్థితి భార్యా భర్తల మధ్య తలెత్తింది. ప్రముఖ బాలీవుడ్‌ కపుల్‌ అంఖిత లోఖండే.. విక్కీ జైన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

సీజన్‌ 17లో భాగంగా ఈ జంట బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టింది. అయితే, హౌస్‌లోకి వెళ్లిన కొన్ని రోజులు బానే ఉన్నారు. తర్వాతి నుంచి ఇద్దరి మధ్యా గొడవలు జరగటం మొదలయ్యాయి. ఈ గొడవలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. అందరి ముందు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవటం.. తిట్టుకోవటం నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా విడుదలైన ప్రోమోలోనూ అంఖిత లోఖండే, విక్కీ జైన్‌లు గొడవలు పడుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకున్నారు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న ఇద్దరి ఫ్యాన్స్‌, నెటిజన్లు.. ‘‘ బిగ్‌బాస్‌ కారణంగా ఈ కాపురంలో చిచ్చు చెలరేగింది..’’ .. ‘‘ త్వరలో ఈ జంట విడాకులు తీసుకోబోతోంది’’.. ‘‘ ఈ ఇద్దరి గొడవలు పడ్డానికే బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వచ్చినట్లు ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ జంట బయటకు వచ్చిన తర్వాత విడాకులు తీసుకోబోతున్నారన్న ‍ప్రచారం చాలా గట్టిగా సాగుతోంది. కాగా, ఇప్పుడు తెలుగులో బిగ్‌బాస్‌ సీజన్‌ 7 నడుస్తోంది.

ఈ సీజన్‌కు కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్‌ల మధ్యే గట్టీ పోటీ నడుస్తోంది. ఈ సారి కచ్చితంగా పల్లవి ప్రశాంత్‌ విన్నర్‌గా నిలిచే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. గత సీజన్‌తో పోల్చుకుంటే.. ఈ సీజన్‌ 7లో పల్లవి ప్రశాంత్‌, శివాజీ, రతికల మధ్య గేమ్‌ రసవత్తరంగా సాగుతోంది. టీఆర్‌పీ రేటింగ్‌ పరంగా కూడా ఈ సీజన్‌ ముందంజలో ఉంది. మరి, బిగ్‌బాస్‌ కారణంగా  బాలీవుడ్‌ కపుల్‌ అంఖిత లోఖండే.. విక్కీ జైన్‌ విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş