iDreamPost
android-app
ios-app

యానిమల్ లో ఫాదర్ సెంటిమెంట్.. ఏకంగా అన్నిసార్లు నాన్నా అంటూ..!

  • Published Jan 28, 2024 | 6:43 PM Updated Updated Jan 28, 2024 | 6:43 PM

Animal Movie Papa Count: యానిమల్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో ఎన్నిసార్లు నాన్న అనే పదం వాడారో తెలుసా?

Animal Movie Papa Count: యానిమల్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో ఎన్నిసార్లు నాన్న అనే పదం వాడారో తెలుసా?

  • Published Jan 28, 2024 | 6:43 PMUpdated Jan 28, 2024 | 6:43 PM
యానిమల్ లో ఫాదర్ సెంటిమెంట్.. ఏకంగా అన్నిసార్లు నాన్నా అంటూ..!

ప్రస్తుతం సినిమాలకు సంబంధించి కథ, యాక్షన్, డైరెక్షన్ వంటి వరకు మాత్రమే కాకుండా.. ఫ్యాన్స్ సినిమాలో ఉండే చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో శ్రద్ధగా గమనిస్తున్నారు. అంతేకాకుండా.. ఆ విషయాలను నెట్టింట షేర్ చేసుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ సలార్ కి సంబిధించిన ఒక వార్త సోషల్ మీడియాల్ వైరల్ కావడం చూశాం. అదే 2.30 గంటల సినిమాలో ప్రభాస్ 2.30 నిమిషాలే మాట్లాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ పరిశీలకులు యానిమల్ సినిమా మీద కన్నేశారు. అసలు సినిమా మొత్తంలో నాన్న అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో లెక్కలు వేశారు. అంతేనా.. ఆ మొత్తాన్ని ఒక చిన్న వీడియోగా చేసి మరి పోస్ట్ చేశారు.

యానిమల్ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. రికార్డు స్థాయి కలెక్షన్స్ తో సందీప్ రెడ్డి వంగా కెరీర్ లోనే కాకుండా.. రణ్ బీర్ కపూర్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అయితే ఈ యానిమల్ అనేది వీళ్ల కాంబోలో జస్ట్ ట్రైలర్ మాత్రమే. తర్వాత యానిమల్ పార్క్ తో సందీప్ రెడ్డి వంగా అసలు కథను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. డిసెంబంర్ 1న విడుదలైన ఈ చిత్రం.. జనవరి 26న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం అభిమానులు ఒకింత నిరాశతో ఉన్నారు. అదేంటంటే.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓటీటీలో అన్ కట్ వర్షన్ వస్తుందని చెప్పుకొచ్చాడు. మొత్తం 3.30 నిమిషాల సినిమాని చూస్తారంటూ చెప్పాడు. ఆ వ్యాఖ్యలతో ఓటీటీలో వచ్చే యానిమల్ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు.

animal movie papa word

కానీ, తీరా చూస్తే సెన్సార్ కట్ సినిమానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయంలో మాత్రం సందీప్ పై అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇంక ఈ విషయాన్ని పక్కన పెడితే యానిమల్ సినిమా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ మూవీ అని అందరికీ తెలిసిందే. అంటే ఈ మూవీలో నాన్నా, కొడుకుల మధ్య సీన్స్ కచ్చితంగా భావోద్వేంగా ఉంటాయి. అంతేకాకుండా నాన్న అనే పదం కచ్చితంగా ఎక్కువసార్లు వినిపిస్తుంది. అందరూ అనుకున్నట్లుగానే ఆ పదం ఈ సినిమాలో చాలాసార్లే వినిపిచింది. అయితే ఎన్నిసార్లు అనుకుంటున్నారు? 3 గంటల 22 నిమిషాల 21 సెకన్ల 16 ఫ్రేముల్లో మొత్తం 196సార్లు నాన్న అనే పదం వినిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అన్నిసార్లు నాన్న అనే పదం వినిపిస్తుందా? వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను సందీప్ రెడ్డి వంగా కూడా షేర్ చేస్తూ చాలా బాగా ఎడిట్ చేశారంటూ కామెంట్ చేశాడు.


ఇంక యానిమల్ పార్క విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అదేంటంటే.. ప్రభాస్ ది రాజా సాబ్, సలార్ 2 చేసుకున్నాక స్పిరిట్ కి వస్తాను అనడం.. మరోవైపు బ్రహ్మాస్త్ర 2 ఆలస్యం అవ్వడంతో యానిమల్ పార్క్ ని సెట్స్ మీదకు తీసుకురావాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న తర్వాత సందీప్ రెడ్డి వంగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఎందుకంటే యానిమల్ 2 సినిమా మరో మూడేళ్ల దాకా రాదు అనుకున్నారు. కానీ, ఇప్పుడు కనీసం ఇంకో ఏడాదిన్నరలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. యానిమల్ సినిమాలో 196 సార్లు నాన్న అని వాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş