iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ నుంచి బన్నీకి సరైన సపోర్ట్ దొరకడం లేదా!

  • Published Nov 19, 2024 | 6:02 PM Updated Updated Nov 19, 2024 | 6:02 PM

Comments over pushpa 2 trailer: టాలీవుడ్ సత్తా ఢిల్లీ దాకా వినిపించే స్థాయిలో.. అంచనాలు పెంచుతూ అరాచకం సృష్టిస్తుంది పుష్ప 2. అటు నార్త్ లో బన్నీ కి బ్రహ్మరథం పడుతున్నారు అభిమానులు. మీడియా , సోషల్ మీడియాలో కూడా దుమ్ము దులిపేస్తుంది పుష్ప 2. అయితే ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు టాలీవుడ్ నుంచే బన్నీ కి సరైన సపోర్ట్ లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Comments over pushpa 2 trailer: టాలీవుడ్ సత్తా ఢిల్లీ దాకా వినిపించే స్థాయిలో.. అంచనాలు పెంచుతూ అరాచకం సృష్టిస్తుంది పుష్ప 2. అటు నార్త్ లో బన్నీ కి బ్రహ్మరథం పడుతున్నారు అభిమానులు. మీడియా , సోషల్ మీడియాలో కూడా దుమ్ము దులిపేస్తుంది పుష్ప 2. అయితే ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు టాలీవుడ్ నుంచే బన్నీ కి సరైన సపోర్ట్ లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

  • Published Nov 19, 2024 | 6:02 PMUpdated Nov 19, 2024 | 6:02 PM
టాలీవుడ్ నుంచి బన్నీకి సరైన సపోర్ట్ దొరకడం లేదా!

పుష్ప 2 మరికొద్ది రోజుల్లో ఇదొక భారీ విధ్వంసం సృష్టించబోతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముందు వినిపించిన భారీ బజ్.. ఈవెంట్ లో క్లియర్ గా కనిపించింది. ఇక ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలకు అడ్డు అదుపు లేదు. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు,థియేటర్స్ ఆక్యుపెన్సీ ఇలా ప్రతి దానిలో పుష్ప తన మార్క్ ను కనబరుస్తుంది. ఒక నార్మల్ హీరో పాన్ ఇండియా రేంజ్ లో ఇలాంటి ఇమేజ్ తెచ్చుకోవడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రభాస్ , తారక్ , చరణ్ తెలుగు సినిమా స్థాయిని ఎలా అయితే నెక్స్ట్ లెవెల్ కు తీసుకుని వెళ్లారో.. ఇప్పుడు బన్నీ కూడా అదే చేస్తున్నాడు. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుందని నిక్కచ్చిగా చెప్పొచ్చు. టాలీవుడ్ సత్తా ఢిల్లీ దాకా వినిపించే స్థాయిలో.. అంచనాలు పెంచుతూ అరాచకం సృష్టిస్తుంది పుష్ప 2. అటు నార్త్ లో బన్నీ కి బ్రహ్మరథం పడుతున్నారు అభిమానులు. మీడియా , సోషల్ మీడియాలో కూడా దుమ్ము దులిపేస్తుంది పుష్ప 2. అయితే ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు టాలీవుడ్ నుంచే బన్నీ కి సరైన సపోర్ట్ లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

పుష్ప 2 ట్రైలర్ ఏ రేంజ్ లో పేలిందో తెలియనిది కాదు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్క రాజమౌళి తప్ప ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన హీరోలు , దర్శకులు ఎవరు కూడా దీనిపై రెస్పాండ్ అవ్వలేదు. అటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. దీనితో సోషల్ మీడియాలో దీని గురించి రచ్చ మొదలైంది. అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని కొందరు? ఒకవేళ రెస్పాండ్ అయితే కాస్త బావుండేది అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా హిట్ అవుతుంది అంటే ఆటోమాటిక్ గా తెలుగు సినిమా స్థాయి పెరిగినట్లే. ఇప్పటికే సౌత్ హీరోలు సృష్టించే విధ్వంసానికి నార్త్ వాళ్ళు నోటి మీద వేలు వేసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు బన్నీ కూడా అదే రేంజ్ లో పుష్ప మ్యానియాను స్ప్రెడ్ చేస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా బజ్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి సమయంలో తోటి హీరోలు , దర్శకులు సపోర్ట్ గా ఉంటే .. పుష్ప మ్యానియా ఇంకాస్త స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ టాలీవుడ్ నుంచి కూడా బన్నీ కి హ్యుజ్ సపోర్ట్ దొరికితే మాత్రం అనుకున్న లెక్కలు ఈజీగా అందుకోవచ్చు.

ఇక నార్త్ లో పుష్ప రాజ్ హవా ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఎక్కడ బ్రేక్ ఈవెన్ అయినా అవ్వకపోయినా.. అక్కడ మాత్రం వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ పండితుల అంచనా. లాస్ట్ మినిట్ పెండింగ్ వర్క్స్ ఉన్నా సరే.. మేకర్స్ మాత్రం పక్కా ప్లానింగ్ తోనే బరిలోకి దిగుతున్నారు. ఒక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కే నార్త్ అంతా వణికిపోయింది. ఇంకా అలాంటివి ఆరు భారీ ఈవెంట్స్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఇక వాటితో సినీ సునామి రావడం ఖాయం . పుష్ప రాజ్ పేరు ప్రపంచమంతా మోత మోగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి టాలీవుడ్ సపోర్ట్ యాడ్ అయితే బాలీవుడ్ లో టాలీవుడ్ జెండా పాతేయడం ఇంకా ఈజీ అవుతుందని. అక్కడ మన హీరోల డామినేషన్ ఏ ఉంటుందని.. అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet