iDreamPost
android-app
ios-app

వై విజయ కూతుర్ని చూశారా..? ఇప్పుడెలా ఉందంటే..?

  • Published Aug 17, 2024 | 2:15 AM Updated Updated Aug 17, 2024 | 2:15 AM

ఆ నందమూరి తారక రామారావు నుండి.. మనవడు జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎన్నో తరాలను చూసిన నటి వై విజయ. ఒకప్పుడు తన వ్యాంపు క్యారెక్టర్లతో అల్లాడించిన ఆమె.. ఇప్పటికీ అదే గ్రేస్ తో నటిస్తుండటం విశేషం. ఈమెకు ఓ కూతురు, మనవడు ఉన్నారని తెలుసా.?? వాళ్లు ఇప్పుడెలా ఉన్నారంటే..?

ఆ నందమూరి తారక రామారావు నుండి.. మనవడు జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎన్నో తరాలను చూసిన నటి వై విజయ. ఒకప్పుడు తన వ్యాంపు క్యారెక్టర్లతో అల్లాడించిన ఆమె.. ఇప్పటికీ అదే గ్రేస్ తో నటిస్తుండటం విశేషం. ఈమెకు ఓ కూతురు, మనవడు ఉన్నారని తెలుసా.?? వాళ్లు ఇప్పుడెలా ఉన్నారంటే..?

  • Published Aug 17, 2024 | 2:15 AMUpdated Aug 17, 2024 | 2:15 AM
వై విజయ కూతుర్ని చూశారా..? ఇప్పుడెలా ఉందంటే..?

సుమారు 60 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అప్పటి తరానికి, ఇప్పటి తరానికి వారధిగా మారిన అతికొద్ది మంది నటీనటుల్లో ఒకరు వై విజయ. వై విజయ అంటే ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియదు.. కానీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3ల్లో తమన్నా, మెహ్రీన్ బామ్మగా నటించిన వారిలో ఒకరు. మరో సీనియర్ నటి అన్నపూర్ణమ్మతో కలిసి నవ్వుల పటాస్‌లు పేల్చారు. సీనియర్ ఎన్టీఆర్ నుండి ఇప్పుడు జూనియర్ వరకు ఎన్నో జనరేషన్ హీరోలను చూశారామే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో ఆమె 1400లకు పైగా చిత్రాల్లో నటించారు. మంగమ్మగారి మనవడు, మా పల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య సినిమాల్లో చేపల పులుసు చేయడంలో ఆమెను చేపల పులుసు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవారు. అయితే ఆమె పర్సనల్ విషయాల గురించి అంతగా ఎవరికీ తెలియదు. ఆమె భర్త, పిల్లలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం

తొమ్మిది సంతానంలో ఒకరైన వై విజయ కుటుంబం.. గుంటూరు నుండి కడపకు వలస వెళ్లింది. తండ్రి యెనిగండ్ల జ్ఞానయ్య సహకార మార్కెటింగ్ సొసైటీలో జిల్లా మేనేజర్ కావడంతో అక్కడకు షిఫ్ట్ అయ్యింది ఫ్యామిలీ. చిన్నప్పటి నుండి ఆమెకు మ్యూజిక్ అంటే విపరీతమైన ఇష్టం. అందుకు తగ్గట్లుగా డ్యాన్స్ చేస్తుండటంతో వేసవి సెలవుల్లో నాట్య గురువు వెంపటి చిన సత్యం వద్దకు తీసుకెళ్లి క్లాసులు చెప్పించారు. అలా చెన్నైలోని కేసరి ఉన్నత పాఠశాలలలో 9, 10 తరగతులు పూర్తి చేశారు వై విజయ. ఆమె నాట్య ప్రదర్శన సినిమాల్లో అవకాశం వచ్చేలా చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వెనుదిరిగి చూసుకోలేదు వై విజయ. కేవలం బిగ్ స్క్రీన్ పైనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే…1985లో అమలనాథన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు

ఈ దంపతులకు అనూష్య అనే కూతురు ఉంది. తన కూతుర్ని యాక్టింగ్ వైపుకు తీసుకురాలేదు వై విజయ. కూతురుకి చదువు అంటే ఇంట్రస్ట్ వల్ల ఈ రంగంలోకి తీసుకురాలేదట. భర్త ఓ కాలేజీ కరస్పాండెంట్. రిటైర్ అయ్యాక.. బిజినెస్ రంగంలోకి దిగారు. 2013లో కూతురు అనూష్యకు వివాహం చేశారు ఈ నటి. అప్పుడు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు మొత్తం కదిలి వెళ్లారు. అయితే ఆమెకు అంత పెద్ద కూతురు ఉందని కానీ అప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు ఆమె అమ్మమ్మ కూడా అయ్యారు. కూతురికి ఓ మనవడు కూడా ఉన్నాడు. అల్లుడు సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన వ్యక్తని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వై విజయ.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş