iDreamPost
android-app
ios-app

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సాహో బ్యూటీ! ఫోటోలు వైరల్!

  • Author ajaykrishna Published - 05:14 PM, Fri - 7 July 23
  • Author ajaykrishna Published - 05:14 PM, Fri - 7 July 23
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సాహో బ్యూటీ! ఫోటోలు వైరల్!

సెలబ్రిటీలు సినిమా అప్డేట్స్ గురించే కాదు.. అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ కి సంబంధించి గుడ్ న్యూస్ లు కూడా చెబుతుంటారు. లవ్, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ ఇలా ఏదైనా అవ్వొచ్చు. కానీ.. వాటిలో ఏ ఒక్క వార్త విన్నా ఫ్యాన్స్ కి ఆనందంగానే ఉంటుంది. తాజాగా సాహో ఫేమ్ ఎవలీన్ శర్మ.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గుడ్ న్యూస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవును.. తన బేబీ బాయ్ పిక్ తో పాటు బాబుకు పెట్టిన పేరు కూడా రివీల్ చేసింది ఎవలీన్. ఈ భామ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా గ్లామర్ ప్రియులకు ఎవలీన్.. బాలీవుడ్ మోడల్ గా సుపరిచితమే. జర్మనీ మూలాలు కలిగిన ఎవలీన్.. మోడలింగ్ ద్వారా సినిమాల్లో అడుగుపెట్టింది.

‘టర్న్ లెఫ్ట్’ అనే హాలీవుడ్ మూవీతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఎవలీన్.. తర్వాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడినుండి వరుసగా వచ్చిన అవకాశాలు చేజిక్కించుకుంటూ స్టార్స్ అందరి మూవీస్ లో నటించింది. కట్ చేస్తే.. 2019లో డార్లింగ్ ప్రభాస్ సరసన సాహో మూవీలో మెరిసింది. తెలుగులో ఈ భామకు అదే ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ. ఆ తర్వాత 2021లో తుషార్ బిండి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి మొదటి సంతానంగా కూతురు ఎవ రానియా పుట్టింది. కూతురు కూడా పెళ్ళైన ఏడాదిలోనే అంటే 2021 లోనే పుట్టింది.

ఇక ఈ ఏడాది జనవరిలో తన రెండో ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది ఎవలీన్. మొత్తానికి జులైలో రెండో బిడ్డకు జన్మనిచ్చింది. రెండో సంతానంగా వీరికి కొడుకు పుట్టాడు. బాబు పేరు ఆర్డిన్.. అని ఎవలీన్ ఇన్ స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. తనకు బాబు పుట్టినందుకు ఎంతో చెప్పలేనంత ఆనందంగా ఉందని అమ్మడు చెప్పుకొచ్చింది. అదే విధంగా కొడుకు, భర్తతో దిగిన ఫోటోలు సైతం నెట్టింట షేర్ చేసింది ఎవలీన్. ఈ భామకి రెండో సంతానం కలిగిన విషయం తెలిసి ఇండస్ట్రీ నుండి ప్రముఖులు, సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు. మరి సాహో భామ ఎవలీన్ శర్మకి మీ విషెస్ ని కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet