iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఈటీవీ ప్రభాకర్..?

  • Author ajaykrishna Published - 08:20 AM, Wed - 12 July 23
  • Author ajaykrishna Published - 08:20 AM, Wed - 12 July 23
బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఈటీవీ ప్రభాకర్..?

బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి సందడి చేయడానికి రెడీ అయిపోయింది. గతేడాది 6వ సీజన్ పూర్తి కావడంతో.. కొత్త సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నవారు ఉన్నారు. గత సీజన్ కి దక్కిన ఆదరణ బట్టి.. అసలు కొత్త సీజన్ ఉంటుందా లేదా అనే సంధిగ్ధంలో ఉన్నారు జనాలు. ఇలాంటి సమయంలో నేరుగా ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు నిర్వాహకులు. దీంతో ఒక్కసారిగా బిగ్ బాస్ లవర్స్ అందరూ యాక్టీవ్ అయిపోయి.. అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈసారి కొత్త సీజన్ ని కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి సెట్ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక బిగ్ బాస్ సీజన్ 7లో ఎవరెవరు పాల్గొంటారు? అనే ఆసక్తి ఓవైపు.. ఈసారి ఎలా ప్లాన్ చేశారు? అనే సందేహాలు మరోవైపు. వీటి మధ్య అసలు కంటెస్టెంట్స్ ఎవరు? అని ఆరాలు తీస్తే.. కొంతమంది సెలబ్రిటీల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పోయిన సీజన్ మాదిరి ఎక్కువగా సోషల్ మీడియా పర్సనాలిటీలను పెట్టకుండా.. కాస్త సీనియర్, మీడియం రేంజ్ సినీ, బుల్లితెర సెలబ్రిటీలను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సీనియర్ సీరియల్ యాక్టర్, డైరెక్టర్ ఈటీవీ ప్రభాకర్ రాబోతున్నాడని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈటీవీ ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు ఇరవై ఏళ్లకు పైగా అటు ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. సీరియల్స్ లో అయితే ప్రభాకర్ కి తిరుగులేదు. నటుడుగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా ప్రభాకర్ ప్రూవ్ చేసుకున్నారు. సీరియల్స్ తో పాటు సినిమాలు.. టీవీ ప్రోగ్రాంలను హోస్ట్ చేసిన అనుభవం కూడా ప్రభాకర్ కి ఉంది. మరి ఇలాంటి మల్టీటాలెంటెడ్ పర్సన్ ని బిగ్ బాస్ లోకి పిలుస్తే.. ఫ్యాన్స్ కి అంతకన్నా ఆనందం ఏముంటుంది. చూసేందుకు కూడా సీనియర్స్ ఉంటే హుందాగా అనిపిస్తుంది. మరి ప్రభాకర్ పేరు గట్టిగానే వినిపిస్తున్నా.. క్లారిటీ వచ్చేది షో స్టార్ట్ అయ్యే ముందు. సో.. అప్పటిదాకా వెయిట్ చేయకతప్పదు. మరి బిగ్ బాస్ కొత్త సీజన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom