iDreamPost
android-app
ios-app

రూ.12 కోట్ల లగ్జరీ కారు కొనుగోలు చేసిన ప్రముఖ నటుడు!

  • Published Jan 12, 2024 | 3:16 PM Updated Updated Jan 12, 2024 | 3:16 PM

సాధారణంగా సెలబ్రెటీలకు మార్కెట్ లో కొత్తగా వచ్చే బ్రాండెడ్ వస్తువులు అన్నా, కార్లు, బైక్స్ అన్నా వెంటనే కొనడానికి ఇష్టపడుతుంటారు. ఖరీదైన కార్లు తమకు నచ్చిన వారికి బహుమతిగా ఇస్తుంటారు.

సాధారణంగా సెలబ్రెటీలకు మార్కెట్ లో కొత్తగా వచ్చే బ్రాండెడ్ వస్తువులు అన్నా, కార్లు, బైక్స్ అన్నా వెంటనే కొనడానికి ఇష్టపడుతుంటారు. ఖరీదైన కార్లు తమకు నచ్చిన వారికి బహుమతిగా ఇస్తుంటారు.

  • Published Jan 12, 2024 | 3:16 PMUpdated Jan 12, 2024 | 3:16 PM
రూ.12 కోట్ల లగ్జరీ కారు కొనుగోలు చేసిన ప్రముఖ నటుడు!

మార్కెట్ లో కి వచ్చిన ఏ కొత్త వస్తువైనా తమ సొంతం చేసుకోవాలని ఉత్సాహపడుతుంటారు.. ముఖ్యంగా సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, క్రీడాకారులు, బడా వ్యాపారులు ఎక్కువగా లగ్జరీ కార్లు, బైక్స్, వాచీలు అంటే ఇష్టపడుతుంటారు. తమకు ఇష్టమైన కొత్త బ్రాండ్ కోసం కోట్లు వెచ్చిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్ లోకి ఎన్నో రకాల విలాసవంతమైన కార్లు వచ్చాయి. వాటిలో రోల్స్ రాయిస్, బెంజ్, ఆడీ, బీఎం డబ్ల్యూ, ఓల్వా, జాగ్వార్ ఇలా ఎన్నో రకాల లగ్జరీ కార్లు ఉన్నాయి. వివాహాలు, పుట్టిన రోజు ఇతర సందర్భాల్లో లగ్జరీ కార్లను బహుమతిగా ఇస్తున్నారు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే.. ప్రొడ్యూసర్లు అందులో నటించిన నటీనటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లకు ఖరీదైన కార్లు బహుమతిగా ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ నటుడు అత్యంత ఖరీదైన కారు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 2002 లో హర్రర్ జోనర్ లో వచ్చిన ‘రాజ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఫుట్ పాత్, మర్డర్ మూవీస్ తో మంచి క్రేజ్ సంపాదించాడు. అప్పట్లో ఇండస్ట్రీలో ఇమ్రాన్ హష్మీ పై పలు కాంట్రవర్సీలు వచ్చాయి. ఇమ్రాన్ హష్మీకి కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారు ఖరీదు దాదాపు రూ.12 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. తన బ్లాక్ కలర్ రోల్స్ రాయిస్ కారులో రైడ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల పఠాన్ మూవీతో భారీ విషయాన్ని అందుకున్న షారూఖ్ ఖాన్.. రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Imran Hashmi Bought a new Car

మనీష్ శర్మ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘టైగర్ 3’ లో ఆతిష్ రహ్మాన్ పాత్రలో కనిపించారు ఇమ్రాన్ హష్మి. ఈ చిత్రంలో హష్మీ తన నటనతో విమర్శకులు నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘OG’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. ఇటీవల టాలీవుడ్ లోకి బాలీవుడ్ నటులు వరుసగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మరి తెలుగు లో ఇమ్రాన్ హష్మీ ఎంత వరకు సక్సెస్ సాధిస్తారో చూడాలి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş