iDreamPost
android-app
ios-app

ఈషా రెబ్బాకు పెళ్లైందా? ఇద్దరు పిల్లలు ఉన్నారంటూ షాకిచ్చింది!

రైన హిట్టు మాత్రం పడటం లేదు. టాలెంట్ ఉన్నా కూడా మంచి కమర్షియల్ హిట్టు కోసం ఇంకా ఎదురుచూస్తోంది. ఈషాకు వెండితెర మీద ఉండే క్రేజ్ కంటే కూడా.. సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

రైన హిట్టు మాత్రం పడటం లేదు. టాలెంట్ ఉన్నా కూడా మంచి కమర్షియల్ హిట్టు కోసం ఇంకా ఎదురుచూస్తోంది. ఈషాకు వెండితెర మీద ఉండే క్రేజ్ కంటే కూడా.. సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

ఈషా రెబ్బాకు పెళ్లైందా? ఇద్దరు పిల్లలు ఉన్నారంటూ షాకిచ్చింది!

తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అందం, అభినయం, ఫాలోయింగ్ అంతా బాగానే ఉన్నా.. సరైన హిట్టు మాత్రం పడటం లేదు. టాలెంట్ ఉన్నా కూడా మంచి కమర్షియల్ హిట్టు కోసం ఇంకా ఎదురుచూస్తోంది. ఈషాకు వెండితెర మీద ఉండే క్రేజ్ కంటే కూడా.. సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమెకు ఒక్క ఇన్ స్టాగ్రామ్ లో 24 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈషా రెబ్బా మాయాబజార్ అనే వెబ్ సిరీస్ తో హిట్టు కొట్టింది. ప్రస్తుతం ఓటీటీల్లో మాయా బజార్ వెబ్ సిరీస్ మీద మంచి టాక్ నడుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బాకు మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది.

ఆ ఆనందంలోనే మాయా బజారు టీమ్ మొత్తం సుమ అడ్డా షోలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆటలు, పాటలు, స్కిట్లు ఇలా ఒకటి కాదు నానా హంగామా చేశారు. అయితే ప్రోమో చివర్లో సుమ అడిగిన ప్రశ్న ఈషా రెబ్బా షాకింగ్ ఆన్సర్ చెప్పింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ సమాధానం విన్న తర్వాత సుమ వాళ్ల నాన్న ఎక్కడ ఉంటారు అని మళ్లీ ప్రశ్నిస్తుంది. అంతటితో ఆ ప్రోమో ముగుస్తుంది. ఇప్పుడు ఈ ప్రోమో చూసిన తర్వాత అంతా ఏంటి ఈషా రెబ్బాకు పెళ్లైందా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Eesha Rebba (@yourseesha)

అయితే ఇదంతా ప్రోమో కోసం చేసిన కట్లు అని అందరికీ తెలిసిందే. ఈ కామెంట్స్ పై ఆమె ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. అసలు ఈషా రెబ్బ చెప్పిన ఆ పిల్లలు ఎవరు అనే సంగతి వెల్లడించారు. ఈషా రెబ్బాకు రెండు డాగ్స్ ఉన్నాయంట. వాటినే ఆమె తన పిల్లలుగా చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. ఆమె ఫ్యాన్స్ చెప్పారు అంటే కచ్చితంగా నమ్మాల్సిందే. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఆ పెట్స్ పిక్స్ ఉంటాయి. సో ఆమె చెప్పిన పిల్లలు ఆ డాగ్స్ అని స్పష్టత వచ్చింది. ఇంక ఆమెకు పెళ్లైందా? పిల్లలు ఉన్నారా? అనే ప్రశ్నలకు పుల్ స్టాప్ పడ్డట్లు అయింది.

 

View this post on Instagram

 

A post shared by Eesha Rebba (@yourseesha)

ఇంక ఈషా రెబ్బా కెరీర్ విషయానికి వస్తే.. ఇప్పుడు మాయా బజార్ హిట్టు కొట్టింది. మరో హిట్టు ప్రాజెక్టులో నటించింది. జేడీ చక్రవర్తి లీడ్ రోల్ ప్లే చేసిన దయా అనే ఓటీటీ రిలీజ్ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాకి సంబంధించి ఈషా రెబ్బా డీ గ్లామర్ రోల్ లో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక జర్నలిస్ట్ మిస్సింగ్ కేసు నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సుమ అడ్డా ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap