iDreamPost
android-app
ios-app

డంకీ ట్విట్టర్‌ రివ్యూ.. షారుఖ్‌ వన్‌ మ్యాన్‌ ఆర్మీ షో..

  • Published Dec 21, 2023 | 10:47 AM Updated Updated Dec 21, 2023 | 10:47 AM

Dunki Movie Twitter Review: షారుఖ్‌ ఖాన్‌ మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ డంకీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Dunki Movie Twitter Review: షారుఖ్‌ ఖాన్‌ మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ డంకీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

  • Published Dec 21, 2023 | 10:47 AMUpdated Dec 21, 2023 | 10:47 AM
డంకీ ట్విట్టర్‌ రివ్యూ.. షారుఖ్‌ వన్‌ మ్యాన్‌ ఆర్మీ షో..

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌.. దిగ్గజ దర్శకుడు రాజ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘ డంకీ’’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా విడుదల అయింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ప్రీమియర్స్‌ పడ్డాయి. ప్రీమియర్స్‌ చూసిన షారుఖ్‌ అభిమానులు సగటు సినీ ప్రేక్షకులు డంకీ సూపర్‌ హిట్‌ అంటున్నారు.  ఈ మేరకు తమ ట్విటర్‌ ఖాతాల్లో సినిమా చూసిన అనుభవాలను పంచుకుంటూ ఉన్నారు.

సమీర్‌ ఏఐ బలుసి అనే ట్విట్టర్‌ ఖాతాధారుడు.. ‘‘ రాజ్‌ కుమార్‌ హిరానీ మళ్లీ అదరగొట్టాడు. స్క్రిప్ట్‌ చాలా బాగుంది. నటీ,నటుల నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో హిందీ సినిమా రత్నంలో ఒకటిగా మిగిలిపోతుంది. డైరెక్షన్‌ విషయానికి వస్తే.. రాజ్‌ కుమార్‌ హిరానీ కంటే బాగా తీస్తారని నేను అనుకోవటం లేదు’’ అని పేర్కొన్నాడు.

టీమ్‌ కమల్‌ హాసన్‌ అనే ట్విట్టర్‌ ఖాతాలో.. ‘‘ షారుఖ్‌ ఖాన్‌ తన కెరీర్‌లోనే దిబెస్ట్‌ తీశాడు. నా జీవితంలో చూసిన ఫైర్‌ లాంటి సినిమా డంకీ. స్టోరీ టెల్లింగ్‌ అద్భుతంగా ఉంది. నటన సూపర్‌గా ఉంది. ఐదుకు ఐదు రేటింగ్‌ ఇస్తున్నాను’’ అని రాసుకొచ్చింది.

అమిర్‌ అన్నారీ తన ట్విట్టర్‌ ఖాతాలో.. ‘‘ డంకీ అత్యద్భుతమైన సినిమా. రాజ్‌ కుమార్‌ హిరానీ కెరీర్‌లో ఇది ది బెస్ట్‌ మూవీ. ఈ సినిమా చూసిన తర్వాత నేను చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నాను. జవాన్‌, పఠాన్‌ సినిమాల కంటే ఇది 100 రెట్లు బాగుంది. ఆల్‌ టైమ్‌ మెగా బ్లాక్‌ బాస్టర్‌’’ అని పేర్కొన్నాడు.

కాగా, ఈ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌కు జంటగా తాప్సీ పన్ను నటించారు. విక్కీ కౌశల్‌, అనిల్‌ గ్రోవర్‌, విక్రమ్‌ కొచ్చర్‌, బొమన్‌ ఇరానీలు కీలక పాత్రల్లో నటించారు. పంజాబ్‌లోని లాల్టూ అనే ఫిక్షనల్‌ ప్రాంతంలో 1995లలో కథ మొదలవుతుంది. లాల్టూకు చెందిన ఓ ఐదుగురు వ్యక్తులు.. హర్‌దయాల్‌ సింగ్‌ దిల్హాన్‌(షారుఖ్‌ ఖాన్‌), మను (తాప్సీ పన్ను), సుఖీ (విక్కీ కౌశల్‌) బల్లి(అనిల్‌ గ్రోవర్‌), బగ్గు ( విక్రమ్‌ కొచ్చర్‌) లండన్‌ వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. లండన్‌ వెళ్లడానికి వీరు ఎంచుకున్న మార్గం ఏంటి? ఆ మార్గంలో వీరికి ఎదురైన అనుభవాలే సినిమా కథ.

ఇది షారుఖ్‌ ఖాన్‌, రాజ్‌ కుమార్‌ హిరానీ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా. 2018 తర్వాత దాదాపు నాలుగేళ్లకు పైగా కష్టపడి రాజ్‌ కుమార్‌ హిరానీ డంకీని తీశారు. డంకీలో షారుఖ్‌ ఇది వరకు చూడని పాత్రలో కనిపించనున్నారు. మరి, డంకీ సినిమా ట్విటర్‌ రివ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş