iDreamPost
android-app
ios-app

దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. ఇంట్రస్టింగ్‌గా పోస్టర్

  • Published Feb 03, 2024 | 6:27 PM Updated Updated Feb 03, 2024 | 6:27 PM

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నటుడు దుల్కర్ సల్మాన్. సీతారామంతో తెలుగు అభిమానుల్ని సొంతం చేసుకున్న మమ్ముట్టి కుమారుడు.. రెండేళ్ల గ్యాప్ తర్వాత మరో చిత్రంతో పలకరించబోతున్నాడు.

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నటుడు దుల్కర్ సల్మాన్. సీతారామంతో తెలుగు అభిమానుల్ని సొంతం చేసుకున్న మమ్ముట్టి కుమారుడు.. రెండేళ్ల గ్యాప్ తర్వాత మరో చిత్రంతో పలకరించబోతున్నాడు.

  • Published Feb 03, 2024 | 6:27 PMUpdated Feb 03, 2024 | 6:27 PM
దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. ఇంట్రస్టింగ్‌గా పోస్టర్

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు దుల్కర్ సల్మాన్. తండ్రి పేరును వారసత్వంగా తీసుకున్నాడు కానీ.. నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దుల్కర్ చేసినవే కొన్ని సినిమాలే అయినా..నటనలో తండ్రికి తగ్గ తనయుడు అన్న పేరు వచ్చింది. మణిరత్నం మూవీ ఓ కాదల్ కన్మణి (ఓకే బంగారం) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మహా నటి ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అనతి కాలంలోనే తెలుగు అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. హిట్స్, ప్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్య కథలను ఎంపిక చేసుకుని ముందుకు సాగుతున్నాడు. మాతృభాషతో పాటు తమిళ్, తెలుగు, హిందీ చిత్రాలు చేస్తున్నాడు.

దుల్కర్ మహానటితో కాస్త నెగిటివిటీ మూటకట్టుకున్నప్పటికీ..అతడ్ని అందరికీ చేరువ చేసిన సినిమా సీతారామం. ఇందులో సీతగా మృణాల్ ఠాకూర్ ఎంత అలరించిందో.. లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్.. తన నటనతో ప్రేక్షకుల కన్నీరు పెట్టించాడు. ఆ తర్వాత కింగ్ ఆఫ్ కోత.. అంటూ డబ్బింగ్ సినిమాతో పలకరించాడు. ఇది యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కల్కిలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు మరో తెలుగు సినిమాకు సైన్ చేశాడు మమ్ముట్టి కుమారుడు. లక్కీ భాస్కర్ అంటూ రాబోతున్నాడు.

lucky bhaskar new poster

ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. డబ్బుల కట్టలు, మధ్యలో బ్యాంక్ ఉద్యోగిగా కళ్లజోడు పెట్టుకుని, టక్ చేసుకుని కూర్చొన్న దుల్కర్‌తో పాటు నడిచొస్తున్న అతడిని చూపించారు. డబ్బు చుట్టూ మూవీ తిరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. గత ఏడాది సార్‌తో హిట్ అందుకున్నాడు వెంకీ. సితార ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమాకు జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio