iDreamPost
android-app
ios-app

OTT Movie: OTTలో బిగ్ బాస్ కంటిస్టెంట్ మూవీ. ఫ్రీగా చూసే ఛాన్స్! ఓసారి లుక్ వేయొచ్చు!

  • Published Apr 20, 2024 | 1:05 PM Updated Updated Apr 26, 2024 | 6:20 PM

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి ఎన్నో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ నటించిన ఈ సినిమా ఓటీటీ లో మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి ఎన్నో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ నటించిన ఈ సినిమా ఓటీటీ లో మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

  • Published Apr 20, 2024 | 1:05 PMUpdated Apr 26, 2024 | 6:20 PM
OTT Movie: OTTలో బిగ్ బాస్ కంటిస్టెంట్ మూవీ. ఫ్రీగా చూసే ఛాన్స్! ఓసారి లుక్ వేయొచ్చు!

ఓటీటీ లోకి వచ్చే సినిమాలు ఒకటి రెండు అయితే మిస్ కాకుండా చూస్తుంటారు. కానీ, ఇప్పుడు వారానికి కొన్ని డజన్ల సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చి పడుతున్నాయి. దీనితో కొత్త సినిమాలను చూడాలనే ఆసక్తితో కొన్ని సినిమాలను మిస్ చేస్తున్నారు మూవీ ప్రియులు. అలా ఇప్పటివరకు ఓటీటీ లోకి వచ్చిన సినిమాలలో కొన్ని సినిమాలనైనా మిస్ చేసి ఉంటారు. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కనుక మీరు మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. బిగ్ బాస్ పుణ్యమా అని.. అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు సినిమాలలో ఆఫర్లు క్యూ కడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ చేసిన సినిమా ఇది. మరి ఈ సినిమా ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు.. బిగ్ బాస్ కంటెస్టెంట్ భాను శ్రీ నటించిన.. “అజయ్ గాడు”. ఆమెతో పాటు ఈ సినిమాలో.. రోడీస్ విన్న‌ర్ శ్వేత మెహ‌తా, అజయ్ కుమార్, ప్రాచీ ట‌క్క‌ర్‌, అభ‌య్ బేతిగంటి, జ‌య‌శ్రీ, య‌ద్దం రాజు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు.. అజయ్ కర్తృర్వర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఈ సినిమా మొత్తం కూడా అజయ్ అనే ఒక మధ్య తరగతి వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది. రోజు రోజుకు మారిపోతున్న ప్రపంచాన్ని అర్ధం చేసుకోలేక.. డబ్బు, ప్రేమను ఎలా సంపాదించాలో తెలియక సతమతమౌతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు అజయ్. ఇవన్నీ వదిలేసి తన జీవితం తాను చూసుకుందాం అనుకునే క్రమంలో.. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె ఒక మెడికల్ స్టూడెంట్ కానీ పూర్తిగా డ్రగ్స్ కు బానిసగా మారిపోతుంది. ఈ క్రమంలో ఆమెని సరైన దారిలో పెట్టేందుకు.. బయట ప్రపంచంతో అతను ఎలాంటి యుద్ధం చేశాడు! అతని ప్రేమను గెలిపించుకున్నాడా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5 లో ప్రసారం అవుతోంది. పైగా ఈ సినిమాను ఫ్రీ గా చూసేయొచ్చు. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం.. కాస్త ఫ్రీ టైమ్ దొరికినపుడు చూసేయండి. ఎందుకంటే ఇప్పుడు బయట సమాజంలోని పరిస్థితులు రోజు రోజుకి ఎలా మారుతున్నాయో.. ప్రేమ పేరుతో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో అందరికి తెలియనిది కాదు. యూత్ అంతా కూడా చెడు అలవాట్లకు ఎలా బానిసగా మారుతున్నారా చూస్తూనే ఉన్నాము. మరి అలాంటిది తానూ ప్రేమించిన అమ్మాయి కోసం బయట ప్రపంచంతో యుద్ధం చేసి.. తనను ఎలా మార్చుకున్నాడు అనే విషయాన్నీ.. ఎంతో బాగా స్క్రీన్ మీద చూపించారు. వర్త్ వాచింగ్ అని చెప్పే కంటే.. టైమ్ పాస్ కు ఈ సినిమా చూడొచ్చని చెప్పొచ్చు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/