iDreamPost
android-app
ios-app

OTT suggestion: OTTలో ఉన్న మంచి సినిమా.. దేనికి హైలైట్ కాలేదో తెలియదు! మీరు మిస్ కాకండి!

  • Published Apr 22, 2024 | 2:42 PM Updated Updated Apr 26, 2024 | 6:20 PM

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్నో కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలను మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ సినిమాను మీరు మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్నో కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలను మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ సినిమాను మీరు మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Apr 22, 2024 | 2:42 PMUpdated Apr 26, 2024 | 6:20 PM
OTT suggestion: OTTలో ఉన్న మంచి  సినిమా.. దేనికి హైలైట్ కాలేదో తెలియదు! మీరు మిస్ కాకండి!

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఉండే సినిమాలు, సిరీస్ లు ఒకటి రెండు అయితే మిస్ కాకుండా చూస్తూ ఉంటారు మూవీ ప్రియులు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేనే లేవు.. ఎందుకంటే వారానికి పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. దీనితో అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఇప్పటివరకు వందల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు ఉండి ఉంటాయి. ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి.. అప్పుడప్పుడు మూవీ ప్రియులు కొన్ని సినిమాలను మిస్ చేసే అవకాశం ఉంది. మరి కొంతమంది సోషల్ మీడియాలో ఆయా సినిమాలకు సంబంధించిన పోస్ట్స్ వచ్చే వరకు కూడా.. ఇదొక సినిమా ఉందని తెలియదు. అలాంటి వారందరికీ రిమైండర్ లాంటిదే ఈ సజ్జెషన్. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం..ఒక మంచి వర్త్ వాచింగ్ సినిమాను మిస్ అయ్యినట్లే. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది చూసేద్దాం.

ఈ సినిమా పేరు.. ఫటాఫటి ఇది ఒక బెంగాలీ సినిమా.. బెంగాలీ సినిమా కదా అని లైట్ తీసుకుంటే పొరపడినట్లే.. ఎందుకంటే ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. చాలా మంది ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్స్ , రీల్స్ ను సోషల్ మీడియాలో చూసే ఉంటారు కానీ.. పూర్తి సినిమా కోసం సెర్చ్ చేసి ఉంటారు కూడా.. ఒకవేళ ఎవరికైనా ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలియకపోతే వారి కోసం ఈ ఇన్ఫర్మేషన్. ఈ సినిమా సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో భార్య లావుగా ఉన్న కారణం చేత.. అందరూ ఆమెను విమర్శిస్తూ, అవమాన పరుస్తూ ఉంటారు. ఆమె మాత్రం ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని అనుకుంటూ ఉంటుంది. ఆమె భర్త తప్ప మిగిలిన వారంతా ఆమెను హేళన చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో వారందరిని ఎదురించి.. ఆమె అనుకున్న ఫ్యాషన్ డిజైనర్ గా మారుతుందా లేదా.. విమర్శించే వారందరికీ ఆమె ఎలా సమాధానంగా నిలుస్తుంది ! అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఒక మనిషి చూడడానికి నల్లగా ఉన్నాడని కొందరు, బక్కగా ఉన్నాడని మరికొందరు, లావుగా ఉన్నాడని మరికొందరు.. ఇలా ఎవరికీ తోచినట్లు వారు కామెంట్స్ చేస్తూనే ఉంటున్నారు. కాలం మారుతూ ఎంత ముందుకు వచ్చినా కానీ.. కొన్ని కొన్ని మాటలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇలాంటి సినిమా బాడీ షేమింగ్ తో బాధపడుతున్న వారందరికీ కూడా.. చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పి తీరాలి. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. ఫ్యామిలీ వాచ్.. ఎస్. ఎంచక్కా ఫ్యామిలితో కలిసి ఈ సినిమాను చూసేయొచ్చు. సోషల్ మీడియా రీల్స్ లో ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎన్నో రీల్స్ కూడా వచ్చాయి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel