iDreamPost
android-app
ios-app

అవన్నీ పుకార్లు నమ్మోద్దు.. రాజా సాబ్ టీమ్ ప్రకటన!

  • Published Jul 05, 2024 | 12:57 PM Updated Updated Jul 05, 2024 | 12:57 PM

Raja Saab Movie: పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది.

Raja Saab Movie: పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది.

  • Published Jul 05, 2024 | 12:57 PMUpdated Jul 05, 2024 | 12:57 PM
అవన్నీ పుకార్లు నమ్మోద్దు.. రాజా సాబ్ టీమ్ ప్రకటన!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో రెబల్ స్టార్ కృష్ణం రాజు సోదరుడి తనయుడు ప్రభాస్ ‘ఈశ్వర్’ మూవీతో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. చత్రపతి మూవీతో భారీ విజయం అందుకున్న ప్రభాస్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక బాహుబలి సీరీస్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు కల్కి మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ మూవీపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.. వీటిపై స్పందించిన చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు దర్శకులు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో యంగ్ రెబల్ స్టార్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజా సాబ్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ పెద్దగా రావడం లేదు. కాకపోతే సంక్రాంతి పండుగ సందర్భంగా రాజా సాబ్ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ఓ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు సమాచారం. త్వరలో ప్రభాస్ కూడా సెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కాకపోతే దీనిపై అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ లేదు.

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ‘రాజా సాబ్’ టీమ్ స్పందించి కీలక ప్రకటన చేశారు. ఈ మూవీ ఆడిషన్ కి సంబంధించిన కొన్ని ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అవన్నీ నిజం కాదని తెలిపింది. ఇలాంటి వాటిని ఎవరూ ఎంకరేజ్ చేయవొద్దని చెప్పుకొచ్చింది. సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఉన్నా తామే అధికారికంగా తెలియజేస్తామని.. అనవసరంగా పుకార్లు నమ్మి లేని పోని అపోహలకు పోవొద్దని క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ మూవీ అనౌన్స్ మెంట్ చేసినప్పటి నుంచి స్టోరీ ఇదే అంటూ రక రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ మూవీ హర్రర్ కామెడీ నేపథ్యంలో వస్తుంది, ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారంటూ ప్రచారం జరుతుంది. మొత్తానికి రాజా సాబ్ టీమ్ అఫిషియల్ గా ప్రకటన చేయడంతో అవన్నీ ఒట్టి రూమర్లే అని తేలిపోయింది.

 

Jojobet GirişmeritbetcasibomCasibomcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş