iDreamPost
android-app
ios-app

సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో ప్రియాంక చోప్రా?

  • Published Mar 26, 2024 | 6:24 PM Updated Updated Mar 26, 2024 | 6:24 PM

ఐదేళ్ల తరువాత నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆమె అనేక స్క్రిప్ట్‌లను పరిశీలిస్తున్నారని.. సంజయ్ లీలా బన్సాలీ చెప్పిన స్క్రిప్ట్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట.

ఐదేళ్ల తరువాత నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆమె అనేక స్క్రిప్ట్‌లను పరిశీలిస్తున్నారని.. సంజయ్ లీలా బన్సాలీ చెప్పిన స్క్రిప్ట్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట.

  • Published Mar 26, 2024 | 6:24 PMUpdated Mar 26, 2024 | 6:24 PM
సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో ప్రియాంక చోప్రా?

దాదాపు ఐదేళ్ల తరువాత నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తన వర్క్ కమిట్‌మెంట్స్ కోసం ఇండియాలో ఉన్నారు ప్రియాంక చోప్రా. అనేక కార్యక్రమాలకు హాజరైన తర్వాత, ఆమె తన కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడపడం ద్వారా భారతదేశంలో తన బసను ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ నాటి తన తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్‌లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రియాంక చోప్రాను కలిశారని గట్టి టాక్ వినిపిస్తుంది. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రియాంక ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం భన్సాలీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారట.

కాగా ఇటీవల ఒక వెబ్ సైట్ తో ప్రియాంక టీమ్ సభ్యులు ఆమె అనేక స్క్రిప్ట్‌లను పరిశీలిస్తున్నారని, కానీ ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం పట్టవచ్చు అని తెలిపారు. నిజానికి గత కొన్ని నెలలుగా చాలా మంది మేకర్స్‌ని కలిసినా.. వాస్తవానికి సంజయ్ లీలా బన్సాలీ చెప్పిన స్క్రిప్ట్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట. ఆమెకు ఈ ప్రాజెక్ట్ నచ్చి టైమ్‌లైన్, షెడ్యూల్ తో పాటు కాస్ట్యూమ్స్‌ పై కూడా నిర్ణయం తీసుకోవడానికి భన్సాలీని పలు సార్లు కలుస్తున్నారట.

గతంలోకి వెళితే సంజయ్ లీలా భన్సాలీ – ప్రియాంక చోప్రా ఇంతకు ముందు రెండు ప్రాజెక్ట్‌లలో కలిసి పని చేశారు. దీపికా పదుకొణె – రణ్‌వీర్ సింగ్ నటించిన గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా (2013)లో ‘రామ్ చాహే లీలా’ అనే డ్యాన్స్ నంబర్‌లో ప్రియాంక చోప్రా కనిపించి ప్రేక్షకులని విపరీతంగా అలరించారు. ఆ తరువాత ఆమె బాజీరావ్ మస్తానీ (2015)లో కాశీబాయి పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో దీపిక, రణ్‌వీర్ సింగ్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ముచ్చటగా మూడోసారి సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తారా లేదా తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş