iDreamPost
android-app
ios-app

Indian 2 Movie: ఇండియన్ 2 మూవీలో మనిషా కూడా నటించిందా ! అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది!

  • Published Jun 11, 2024 | 11:33 AM Updated Updated Jun 11, 2024 | 11:33 AM

ఇండియన్ 2 సినిమా గురించి ఇప్పుడు అందరికి భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన మరో వార్తా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తున్నాయి. మరి ఈ తాజా అప్ డేట్ ఏంటో చూసేద్దాం.

ఇండియన్ 2 సినిమా గురించి ఇప్పుడు అందరికి భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన మరో వార్తా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తున్నాయి. మరి ఈ తాజా అప్ డేట్ ఏంటో చూసేద్దాం.

  • Published Jun 11, 2024 | 11:33 AMUpdated Jun 11, 2024 | 11:33 AM
Indian 2 Movie: ఇండియన్ 2 మూవీలో మనిషా  కూడా నటించిందా ! అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది!

రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చెంజర్ మూవీతో పాటు.. కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 మూవీ.. ఈ రెండు కూడా భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్న.. దర్శకుడు శంకర్ చిత్రాలే. ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినా కూడా.. అనేక కారణాల వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమాను జులై12 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్ . తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోను ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్ . దీనితో ప్రస్తుతం చిత్ర బృందం అంతా కూడా మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాలో నటి మనిషా కొయిరాలా పేరు కూడా వినిపిస్తుంది. మరి ఆ విషయాలేంటో చూసేద్దాం.

నటి మనీషా కొయిరాలా.. మొదట నేపాలీ చిత్రంతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళం , హిందీ , ఇంగ్లీష్ భాషల్లో నటించిన చాలా పాపులర్ అయింది. మరి ముఖ్యంగా తమిళంలో ఇండియన్, బొంబాయి , బాబా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు మనీషాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కమల్ హాసన్ తండ్రి కొడుకులుగా.. నటించిన సినిమా ఇండియన్.. అందులో కొడుకు క్యారక్టర్ కు జోడిగా మనీషా నటించింది. 1996 లో వచ్చిన ఈ సినిమా.. అనుకోను విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు 28 ఏళ్ళ తర్వాత ఇండియన్ సినిమాను సిక్వెల్ ను జులై 12 న తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో భారీ తారాగణమే పాలు పంచుకున్నారు. అయితే ఇందులో మనీషా నటించిన విషయాన్నీ మాత్రం రహస్యంగా ఉంచారు. ఇక ఇటీవలే దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. దీనితో ఈ విషయం కొన్ని చర్చలకు దారి తీసింది.

ఇండియన్ 2 సినీమియాలో మనీషా కూడా ఉందా ! ఉంటె ఈసారి ఈ సిక్వెల్ లో మనిషా పాత్ర ఏంటి ! 53 ఏళ్ళ మనీషాకు ఈ సినిమాలో చెప్పుకోదగిన పాత్రే ఉంటుందా ! ఇలా అందరికి రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇటీవలే మనిషా క్యాన్సర్ వ్యాధికి గురి అయ్యి.. దానితో పోరాడి గెలిచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల హీరమండి సిరీస్ లోను మనిషా పాత్ర అందరిని ఎంతో మెప్పించింది. అది కాకుండా మనిషా చివరిగా ధనుష్ హీరో గా నటించినా మాప్పిళై చిత్రంలో ధనుష్ కు అత్త పాత్రలో నటించింది. మరి ఇండియన్ 2 లో మనీషా పాత్ర ఏమై ఉంటుంది అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş