iDreamPost
android-app
ios-app

నాగార్జున పక్కన నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా!

  • Published Feb 07, 2024 | 3:37 PM Updated Updated Feb 07, 2024 | 3:37 PM

ఒకప్పుడు నాగర్జున సరసన ఎంతో అందంగా, ఆద్భుతంగా కనిపించి అలరించిన హీరోయిన్ నేడు గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. ఇంతకి ఆమె ఎవరంటే..

ఒకప్పుడు నాగర్జున సరసన ఎంతో అందంగా, ఆద్భుతంగా కనిపించి అలరించిన హీరోయిన్ నేడు గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Feb 07, 2024 | 3:37 PMUpdated Feb 07, 2024 | 3:37 PM
నాగార్జున పక్కన నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా!

సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు నటన పై ఆసక్తితో వెండితెర పై ఎంట్రీ ఇస్తారు. అయితే అలా అడుగు పెట్టినవారు మొదట ఏ పాత్ర వచ్చిన అందిపుచ్చుకుంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలా వచ్చిన ఆవకాశాలను సద్వినియోగం చేసుకున్న వారు నేడు స్టార్ హీరోయిన్ లు గా వెలుగుతున్నారు. కానీ, అతికొద్ది మంది మాత్రమే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ప్రేమ, పెళ్లి, ఆఫైర్స్ అంటూ ఇండస్ట్రీకి దూరమవుతారు. ఇప్పుడు మనం చెప్పుకునే హీరోయిన్ కూడా ఆ కోవకు చెందినదే. ఈమె నాగర్జున నటించిన ఓ సినిమాలో కథానాయికగా నటించింది. ఇక ఆ సినిమాలో ఆమె నటనకుగాను ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత.. మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైయింది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

కింగ్ నాగర్జున నటించిన ‘ఆవిడే మా ఆవిడ’ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. కంప్లీట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందులో నాగర్జున ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్త పాత్రలో కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులో ఒక హీరోయిన్ టబు నటించిన విషయం తెలిసిందే. ఇక మరొక హీరోయిన్ గా నటించిన ఆ కథానాయిక ‘హీరా రాజగోపాల్’. ఇప్పుడు పై ఫోటోలో గుర్తుపట్టాలేనంతగా మారిపోయిన హీరోయిన్ కూడా హీరానే. ఈమె ఈ సినిమాలో ఝాన్సీ పాత్రలో అలరించింది. అయితే చెన్నైకి చెందిన హీరా మొదటగా ‘పబ్లిక్ రౌడీ’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత.. ‘దొంగల రాజ్యం’, ‘లిటిల్ సోల్జర్స్’, ‘శ్రీకారం,’ ‘ఆహ్వానం’, ‘చెలికాడు,’ ‘అంతపురం,’ ‘పెద్ద మనషులు’, ‘అల్లుడుగారోచ్చారు’ సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘దొంగ దొంగ’ సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు.

ఇక హీరా తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి. చివరిగా హీరా 1999లో ‘స్వయంవరం’ అనే చిత్రంలో నటించారు. దీని తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు. కాగా, 2002లో పుష్కర్ మాధవ్‌ను పెళ్లాడిన హీరా 2006లో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలోనే ఒంటరిగా జీవిస్తుంది. అయితే సినిమాలకు దూరంగా ఉంటున్న హీరా.. అటు సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. అలాగే అప్పట్లో ఆమె కోలీవుడ్ హీరో అజిత్ తో ప్రేమలో పడిందని రూమర్స్ వచ్చిన,అది పెళ్లిదాక వెళ్లలేదు. దీంతో అప్పటి నుంచి హీరా సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు టాక్ వినిపించింది. ప్రస్తుతం హీరాకు సంబంధించిన లేటేస్ట్ ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరి, ఎంతో అందంగా, ఉన్న హీరా గుర్తలేనంతగా మారిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet