iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ని గుర్తు పట్టారా? హత్యకేసులో అరెస్ట్ చేశారు?

  • Published Jun 11, 2024 | 5:15 PM Updated Updated Jun 11, 2024 | 5:15 PM

Actor Darshan Case: ఇప్పుడు దేశం మొత్తం కన్నడు ఇండస్ట్రీ గురించి చర్చించుకుంటున్నారు. కన్నడ స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ని హత్య కేసులో అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

Actor Darshan Case: ఇప్పుడు దేశం మొత్తం కన్నడు ఇండస్ట్రీ గురించి చర్చించుకుంటున్నారు. కన్నడ స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ని హత్య కేసులో అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

  • Published Jun 11, 2024 | 5:15 PMUpdated Jun 11, 2024 | 5:15 PM
ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ని గుర్తు పట్టారా? హత్యకేసులో అరెస్ట్ చేశారు?

ఇటీవల వరుసగా సినీ సెలబ్రెలు వివిధ కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో కోలీవుడ్ నటుడు కులికల్ జయచంద్రన్ అరెస్ట్ అయ్యాడు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటి హేమ, కన్నడ బ్యూటీ ఆశీ రాయ్ బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో అడ్డంగా బుక్క అయ్యారు.ఈ కేసులో హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో చాలెంజింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో దర్శన్ ని అరెస్ట్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దర్శన్ అరెస్ట్ విషయంలో ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకీ ఈ పవిత్ర గౌడ ఎవరు..? ఆమె బ్యాగ్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకొని కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శన్ తాజాగా ఓ హత్య కేసులో అరెస్ట్ అవడంపై అటు ఫ్యాన్స్.. ఇటు సినీ వర్గాలు షాక్ కి గురయ్యాయి. రేణుకాస్వామి అనే ఓ వ్యక్తిని దర్శన్ చంపించాడని నేరం రుజువు కావడంతో మైసూర్ లోని ఫామ్ హౌజ్ లో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే దర్శన్ కేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవిత్ర గౌడ. ఈ కేసులో పవిత్ర గౌడను కూడా బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకోవం సంచలనంగా మారింది. అయితే పవిత్ర గౌడ ఎవరు అనే విషయం ఇప్పుడు నెటిజన్లు ఆసక్తిగా సర్చ్ చేస్తున్నారు. పవిత్ర గౌడ విషయానికి వస్తే.. కన్నడ నటి, ఫ్యాషన్ డిజైనర్, దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్ గా రాణించింది. 2013లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పవిత్ర గౌడ. చత్రిగాలు సార్ చత్రిగాలు, ఆగమ్య, సాగువ దారియాలి అనే సినిమాల్లో నటించింది. గతంలో ఆమె సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఖుషీ అనే కూతురు పుట్టింది. కొన్ని రోజులు వీరి దాంపత్యం హ్యాపీగా కొనసాగినా.. కొంతకాలం తర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు.

ఈ క్రమంలోనే హీరో దర్శన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రిలేషన్ షిప్‌కి దారి తీసింది. వీరి రిలేషన్ షిప్ గురించి 2017 లో సోషల్ మాధ్యమాల ద్వారా బయటకు వెల్లడించింది. ఆ ఫోటోలపై దర్శన్ అభిమానులు తీవ్ర విమర్శలు చేయడంతో వాటిని తొలగించింది. ఇదే వ్యవహారంలో దర్శన్ భార్య విజయలక్ష్మి తరుచూ గొడవలు పడుతూ వస్తుంది. రేణుకాస్వామి అనే వ్యక్తి అసభ్య మెసేజ్, అశ్లీల ఫోటోలు పంపిస్తున్నాడంటూ దర్శన్ కి ఫిర్యాదు చేసింది పవిత్ర గౌడ. ఈ విషయం సీరియస్ గా తీసుకున్న దర్శన్ కొంతమందికి సుపారీ ఇచ్చి అతన్ని చంపించాడు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ కీలక సూత్రదారి కావడంతో అతన్ని అరెస్ట్ చేశారు.అంతేకాదు ఈ కేసులో పవిత్ర గౌడ ప్రమేయం ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు బెంగుళూరు పోలీసులు. ప్రస్తుతం పవిత్ర గౌడకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Vijayalakshmi darshan (@viji.darshan)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş