iDreamPost
android-app
ios-app

‘డార్లింగ్’మూవీలో ప్రభాస్‏ను ఆటపట్టించిన కుర్రోడు గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడంటే!

  • Published Jun 01, 2024 | 3:29 PM Updated Updated Jun 01, 2024 | 3:29 PM

Prabhas Darling Movie: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు పెద్దయ్యాక హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ పాత్రల్లో నటించారు. కొంతమంది సక్సెస్ అయితే.. కొంతమంది కనిపించకుండా పోయారు.

Prabhas Darling Movie: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు పెద్దయ్యాక హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ పాత్రల్లో నటించారు. కొంతమంది సక్సెస్ అయితే.. కొంతమంది కనిపించకుండా పోయారు.

  • Published Jun 01, 2024 | 3:29 PMUpdated Jun 01, 2024 | 3:29 PM
‘డార్లింగ్’మూవీలో ప్రభాస్‏ను ఆటపట్టించిన కుర్రోడు గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడంటే!

ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు తర్వాత క్రమంలో హీరో, హీరోయిన్లుగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సెటిల్ అయ్యారు. కమల్ హాసన్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్,కళ్యాన్ రామ్, మహేష్ బాబు నుంచి మొదలు కొని ఈ మధ్య ‘హనుమాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న తేజ సజ్జా వరకు బాల నటులుగా నటించిన వారే. ఇక హీరోయిన్లు శ్రీదేవి, మీనా, నిత్యా మీనన్ ఇలా ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి హారోయిన్లుగా మారారు. ఎ కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘డాల్లింగ్’ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీలో కాజల్ తమ్ముడిగా నటించి.. ప్రభాస్ ని ఆట పట్టించిన కుర్రాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు బాల నటులుగా నటించిన వారు తర్వాత స్టార్ హీరో, హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు. ఎ కరుణాకరన్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రం ‘డార్లింగ్’. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై నిర్మించారు. 2010 ఏప్రిల్ 23న రిలీజ్ అయిన డార్లింగ్ చిత్రంలో హీరోగా ప్రభాస్, హీరోయిన్ గా కాజల్ నటించింది. మరో ముఖ్యపాత్రలో శ్రద్దా దాస్ నటించింది. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ మేనల్లుడు జివి ప్రకాశ్ సంగీతం అందించాడు. ఇదిలా ఉంటే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోతున్నారు. డార్లింగ్ మూవీలో ప్రభాస్‌ని ఆటపట్టించే కుర్రోడు అంటే ఎవరికైనా ఇట్టే గుర్తుకు వస్తుంది. కాజల్ తమ్ముడిగా ప్రభాస్‌తో ఒక్క ఆట ఆడుకుంటాడు. ఆ కుర్రాడి పేరు గౌరవ్.

డార్లింగ్ సినిమాతో ఫుల్ ఫేమస్ అయిన గౌరవ్ తెలుగులో అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు. బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమాలోనూ కనిపించాడు. డార్లింగ్ మూవీ కన్నా ముదు గౌరవ్ పలు స్టేజ్ షోలు, డాక్యుమెంటరీలో నటించాడు. రవితేజ, అనుష్క నటించిన బలాదూర్ మూవీలో బాలనటుడిగా నటించాడు. దాదాపు 20 చిత్రాల్లో గౌరవ్ తన నటనతో మోప్పించాడు. అయితే డార్లింగ్ సినిమాలో మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం గౌరవ్ పెద్దవాడయ్యాడు.. హీరో రేంజ్ లో కనిపిస్తున్నాడు. పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Gaurav (@gaurav.dasari)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş