iDreamPost

జైబోలో తెలంగాణ మూవీలో ఎంతో పద్దతిగా ఉన్న ఆ నటి.. ఇప్పుడు ఈ రేంజ్‌లో!

  • Published Jun 25, 2024 | 1:27 PMUpdated Jun 25, 2024 | 1:27 PM

Meera Nandan: జైబోలో తెలంగాణ సినిమా చూశారా.. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మీరా నందన్‌ ప్రజెంట్‌ పిక్స్‌.. ఇప్పుడు వైరల్‌గా మారాయి. వాటిని చూసిన జనాలు.. వామ్మో ఈ రేంజ్‌ గ్లామరా అంటున్నారు. ఆ వివరాలు..

Meera Nandan: జైబోలో తెలంగాణ సినిమా చూశారా.. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మీరా నందన్‌ ప్రజెంట్‌ పిక్స్‌.. ఇప్పుడు వైరల్‌గా మారాయి. వాటిని చూసిన జనాలు.. వామ్మో ఈ రేంజ్‌ గ్లామరా అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Jun 25, 2024 | 1:27 PMUpdated Jun 25, 2024 | 1:27 PM
జైబోలో తెలంగాణ మూవీలో ఎంతో పద్దతిగా ఉన్న ఆ నటి.. ఇప్పుడు ఈ రేంజ్‌లో!

తక్కువ సినిమాల్లో నటించినా సరే.. కొందరు నటీనటులను అంత త్వరగా మర్చిపోలేము. తక్కువ కాలంలో తమ అద్భుతమైన ప్రతిభతో.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అందమైన రూపం, అద్భుతమైన నటనతో.. తమకిచ్చిన పాత్రల్లో జీవించేస్తారు. అందుకే తక్కువ సినిమాలు చేసినా.. ఎక్కువ కాలం ప్రజల మదిలో నిలిచిపోతారు. ఇలాంటి వారికి అభిమానులు కూడా ఎక్కువగానే ఉంటారు. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న నటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్క సినిమాతో ఆమె తెలుగు వారికి చేరువయ్యింది. టాలీవుడ్‌లో ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా భావించారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆమె సినిమాలకు దూరం అయ్యిది. ఇంతకు ఆ నటి ఎవరు.. ఏ చిత్రంలో నటించింది.. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే..

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో జైబోలో తెలంగాణ అనే సినిమా వచ్చింది. జగపతి బాబు, స్మృతి ఇరానీలతో పాటు మరి కొందరు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈసినిమాలో హీరోయిన్‌గా నటించిన మీరా నందన్‌. అమాయకమైన రూపం, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అనంతరం టాలీవుడ్‌కి పూర్తిగా దూరం అయ్యింది.

ఇక గతేడాది ఆమె ప్రముఖ వ్యాపారవేత్తను శ్రీజును వివాహం చేసుకుంది మీరా నందన్‌. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన మీరా నందన్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు చూసిన నెటిజనులు.. సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన నటి ఈమెనా.. పెళ్లైనా మీ గ్లామర్‌, అందం ఏమాత్రం తగ్గలేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక మీరా నందన్‌ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆమె 1990 నవంబర్ 26న కేరళలోని కొచ్చి ప్రాంతంలో జన్మించింది. జర్నలిజం కంప్లీట్ చేసింది. ఆ తర్వాత మోహన్ లాల్ టేస్ట్ బడ్స్ కోసం ఓ ప్రకటనలో నటించింది. ఆ తర్వాత 2007లో ఆమె ఐడియా స్టార్ సింగర్ పోటీలో పాల్గొంది. ఈ షోకు యాంకర్‌గా పనిచేసిన మీరా నందన్.. బుల్లితెర మీద టాప్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2007లో మలయాళంలో వచ్చిన ముల్లా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. మీరా నందన్‌ తల్లిదండ్రులు మలయాళీ నటి దివ్య ఉన్నికి బంధువులు అవుతారు. ఇప్పుడీ నటి.. ఇంటికే పరిమితం అయ్యి.. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Meera Nandhaa (@nandan_meera)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి