iDreamPost
android-app
ios-app

ఎవరో గుర్తుపట్టారా? ఈ పిల్లాడి కోసం సినిమాలో ఏకంగా యువరాణి దిగివచ్చింది!

  • Author ajaykrishna Published - 04:41 PM, Fri - 28 July 23
  • Author ajaykrishna Published - 04:41 PM, Fri - 28 July 23
ఎవరో గుర్తుపట్టారా? ఈ పిల్లాడి కోసం సినిమాలో ఏకంగా యువరాణి దిగివచ్చింది!

కొంతమంది హీరోలు చిన్నతనం నుండే సినిమా బ్యాక్గ్రౌండ్ ని కలిగి ఉంటారు. ఎలాగో పెద్దయ్యాక సినిమాల్లోకి వస్తారు. వాళ్ల పేరెంట్స్ కూడా ముందునుండి పిల్లల ఇంటరెస్ట్ బట్టి సినిమాల్లోకి రావడానికి రెడీ చేస్తుంటారు. అయితే.. ప్రస్తుతం మీరు పైన ఫోటోలో కారు డ్రైవ్ చేస్తున్న పిల్లాడు.. సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందినవాడే. ఎవరో గుర్తుపట్టారా.. దక్షిణాది చిత్రపరిశ్రమలో తానొక యూనిక్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. పైగా సౌత్ కి చెందిన ఓ భాషలో స్టార్ హీరో కూడా. గమనిస్తే పక్కాగా కనిపెట్టే అవకాశం ఉంది. అలాగని ఈజీ కూడా కాదని చెప్పాలి. ఎందుకంటే.. ఈ హీరోకి ఇండియా వైడ్ క్రేజ్ ఉంది. కానీ.. ఇప్పటిదాకా ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయలేదు.

ఇక ఇండస్ట్రీలో ఎవరి వారే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా క్రేజ్ కోసం పరితపిస్తున్నారు. కానీ.. ఇతను ఏ భాషకు ఆ భాషలోనే సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నాడు. ముఖ్యంగా తమిళ, తెలుగు మాత్రమే కాదు.. కన్నడ, హిందీ, మలయాళంలో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా.. అంతటి క్రేజ్ సొంతం చేసుకున్నాడంటే అర్ధం చేసుకోవచ్చు. తన టాలెంట్ ఎలాంటిదో. ఇప్పటికి గుర్తు రాకపోతే ఓ క్లూ ఇస్తా.. కొన్నాళ్ళ క్రితం పాపులర్ బయోపిక్ లో హీరోగా నటించాడు. ఆ బయోపిక్ లో నటించిన హీరోయిన్ కి నేషనల్ అవార్డు లభించింది. ఎవరో ఇప్పటికైనా తెలిసిందా..?

ఇంకా గుర్తు రాలేదు.. అనంటే మీకో పెద్ద క్లూ ఇస్తా! ఈ హీరో కోసం ఓ సినిమాలో ఏకంగా యువరాణి తన రాజ్యాన్ని వదులుకొని వచ్చేసింది. కానీ.. బ్యాడ్ లక్ ఏంటంటే అందులో ఇతని క్యారెక్టర్ అర్థాంతరంగా ముగిసింది. ఇప్పుడు తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. ఆ సినిమా సౌత్ లోనే కాదు.. హిందీలోను బిగ్ సక్సెస్ అయింది. ఆ యువరాణి కూడా తెలుగు ఫస్ట్ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. హ.. ఇప్పుడు చెప్పేస్తున్నా.. అతనెవరో కాదు దుల్కర్ సల్మాన్. ఇతని గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మహానటి బయోపిక్ తో.. గతేడాది సీతారామం మూవీతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అలాగే తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం మలయాళంలో స్టార్ అయిన దుల్కర్ కి సంబంధించి చిన్నప్పటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పిల్లాడి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis