iDreamPost
android-app
ios-app

ఈ పాప ఎవరో తెలుసా? తెలుగు హీరోతో ఒకే ఒక్క సినిమా చేసింది..

  • Author ajaykrishna Published - 04:53 PM, Wed - 26 July 23
  • Author ajaykrishna Published - 04:53 PM, Wed - 26 July 23
ఈ పాప ఎవరో తెలుసా? తెలుగు హీరోతో ఒకే ఒక్క సినిమా చేసింది..

సాధారణంగా ప్రేక్షకులు ఎంతో అభిమానించే సినీతారలు అప్పుడప్పుడు కొత్త లుక్ లో కనిపిస్తేనే.. ఆనందం వ్యక్తం చేస్తుంటారు. అలాంటిది వారి పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొత్త విషయాలు తెలిస్తే.. అందులోనూ సెలబ్రిటీల చిన్నతనంలో జరిగినవి తెలుసుకున్నప్పుడు కలిగే ఫీలింగ్ వేరుగా ఉంటుంది. చిన్నప్పటి మెమోరీస్ ఎవరికైనా స్పెషలే. ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూస్తున్న బ్యూటీ చాలా పాపులర్ హీరోయిన్. ఇండియాలో పాపులర్ అయిన సూపర్ హీరో సినిమాలలో ఆమెనే హీరోయిన్. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. అదికూడా స్ట్రెయిట్ మూవీ కాదు.. బట్ ఆ ఒక్క సినిమాలో హీరో మాత్రం తెలుగువాడే కావడం విశేషం.

ఇంతకీ ఎవరో తెలిసిందా..? ఆ బ్యూటీ పాన్ ఇండియా వైడ్ పరిచయం అక్కర్లేదు. కాసేపు దృష్టిపెట్టి గమనించారంటే ఇట్టే అర్ధమవుతుంది. అయితే.. తెలుగులో కంటే ఈ భామ బాలీవుడ్ లో చాలా ఫేమస్. పైగా హీరోయిన్ గా దాదాపు అందరు బాలీవుడ్ స్టార్స్ ని కవర్ చేసేసింది. ఈ భామ కూడా సినిమాల్లోకి మోడలింగ్ ద్వారానే వచ్చింది. వచ్చి రాగానే బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కెరీర్ స్టార్టింగ్ కదా.. చాలా బోల్డ్ రోల్స్ చేసి.. సూపర్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కానీ.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మెల్లగా హాలీవుడ్ నుండి ఆఫర్స్ ఓకే చేసుకుంటూ… గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మీకు ఎవరో క్లియర్ గా అర్థమైంది కదా!

ఆ ఫోటోలో ఉన్న పాపను గ్లోబల్ బ్యూటీ అని పిలుస్తుంటారు. ఆమె ఎవరో కాదు.. ప్రియాంక చోప్రా. హాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన ఈ భామ.. ఏకంగా ఇంగ్లీష్ సింగర్ నిక్ జోనస్ ని ప్రేమించి.. 2018లో పెళ్లి చేసుకుంది. ఇక్కడ అసలు ట్విస్టు ఏంటంటే.. ప్రియాంక వయసులో తన భర్త కంటే పదేళ్లు పెద్దది. ప్రస్తుతం అమ్మడికి 41 ఏళ్లు కాగా.. ఆమె భర్త నిక్ వయసు 31 ఏళ్లు. పెళ్లి అయ్యాక పూర్తిగా భర్తతో కలిసి ఫారెన్ లో సెటిల్ అయిపోయింది. ఇక వీరిద్దరూ సరోగసీ ద్వారా కూతురు మాల్తీకి జన్మనిచ్చారు. ఇక ఇండియన్ ఫస్ట్ సూపర్ఉం హీరో సిరీస్డ క్రిష్గా లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.. ఇప్పుడు హాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ.. అప్పుడప్పుడు బాలీవుడ్ పై వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటుంది అమ్మడు. మరి ఈ పాప గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet