iDreamPost
android-app
ios-app

Salaar: సలార్ మూవీలో బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించిన ఈమె ఎవరో తెలుసా..

ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్- ది సీజ్ ఫైర్ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలో చిన్న నటీ నటులకు కూడా మంచి క్యారెక్టర్ పడింది. దీంతో వారికి ఒక్కసారిగా నేమ్ అండ్ ఫేమ్ రావడంతో ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్- ది సీజ్ ఫైర్ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలో చిన్న నటీ నటులకు కూడా మంచి క్యారెక్టర్ పడింది. దీంతో వారికి ఒక్కసారిగా నేమ్ అండ్ ఫేమ్ రావడంతో ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Salaar: సలార్ మూవీలో బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించిన ఈమె ఎవరో తెలుసా..

డార్లింగ్ ప్రభాస్ మూవీ సలార్ థియేటర్ల వద్ద ఊచకోత కోస్తుంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు అనడంతో అతిశయోక్తి లేదు. ఆరు ఏళ్లుగా అతడి మూవీస్ విషయంలో అభిమానులు ఏదైతే కోల్పోయామని ఫీల్ అవుతున్నారో.. ఈ మూవీతో తిరిగి ఇచ్చేశాడు యంగ్ రెబల్ స్టార్. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ.. థియేటర్లను దడదడలాడించేస్తోంది. ఇక ఈ మూవీలో ప్రతి ఒక్కరికి మంచి రోల్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. చిన్న చిన్న పాత్రలు చేసిన వారికి సైతం మంచి గుర్తింపు వస్తుంది. తమకు పాపులారిటీ రావడంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు నటీనటులు.

ఈ మూవీలో కేవలం ఒకటి, రెండు సీన్లలో నటించిన నటీనటులకు మంచి డైలాగ్స్ ఉన్నాయి. కాటేరమ్మ రాలేకపోయింది కానీ బదులుగా కొడుకును పంపించింది అన్న డైలాగ్‌తో ఫేమస్ అయ్యింది చైల్డ్ ఆర్టిస్ట్ సయ్యద్ ఫర్జానా. ఆ యువతిని విలన్ కోరగా.. ఆమెను ముస్తాబు చేసేందుకు సిద్దం చేసే పాత్రలో ఓ బోల్డ్ క్యారెక్టర్లలో నటించారో ఇద్దరు మహిళలు. అందులో ‘ రెండు నిమిషాలు ఇవ్వు బావా.. దొరసానిలా తయారు చేస్తాను’ అన్న ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయ్యిందో నటి. ఆమె పేరు పూజా విశ్వేశ్వర్. ఆమె చెప్పిన ఈ ఒక్క డైలాగ్ ను ట్రోల్స్ కూడా ఫేమస్ అయ్యాయి.  ఆమె ఇప్పటికే పెద్ద హీరోల సినిమాల్లో నటించినప్పటికీ..ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో పనిచేయడం, హిట్ కొట్టడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ మూవీ కోసం ఆడిషన్ ఇచ్చి వైజాగ్ వెళ్లిపోయిన తర్వాత.. తనకు ఆఫర్ వచ్చిందని.. తనతో ఎవరో జోక్ చేస్తున్నారని పేర్కొంది. ఈ మూవీ కోసం ఐదు రోజులు షెడ్యూల్ అనుకున్నారట కానీ.. ప్రొలాంగ్ అయ్యిందని అన్నారు. బోల్డ్‌గా కనిపిస్తే.. త్వరగా రీచ్ అవుతానన్న ఉద్దేశంతో సలార్ చిత్రంలో అలా కనిపించినట్లు తెలిపింది. కొన్ని సీన్లు ఎడిటింగ్‌లో పోయాయని, కానీ ఒక్క డైలాగ్‌తో తనకు పేరు రావడంతో సంతోషించానన్నారు. తాను గాడ్ ఫాదర్, టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాల్లో కూడా నటించిందట. త్వరలో వైవా హర్షతో సుందరం మాస్టారు, పార్వతీశం యాష్ ఎంఎం, మంత్ర మూవీ డైరక్షన్‌లో దక్షిణ అనే మూవీ చేయబోతున్నట్లు వెల్లడించింది. మరీ ఈ సినిమా చూసినట్లయితే ఆమె డైలాగ్ ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kotesh Goud Surya (@kotesh_goud_surya)

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin