iDreamPost
android-app
ios-app

తన కొడుకు కోసం స్టార్ హీరో ఏం చేశాడో తెలుసా?

  • Published Mar 31, 2024 | 4:54 PM Updated Updated Mar 31, 2024 | 4:54 PM

Hero Son Name Tattooed in Hand: పెళ్లైన తర్వాత తమకు పుట్టబోయే సంతానం కోసం ఎన్నో కలలు కంటారు నవదంపతులు. తనకు కొడుకు పుట్టిన సంతోషాన్ని కనీ వినీ ఎరుగని రీతిలో వ్యక్తం చేశాడు ఓ స్టార్ హీరో

Hero Son Name Tattooed in Hand: పెళ్లైన తర్వాత తమకు పుట్టబోయే సంతానం కోసం ఎన్నో కలలు కంటారు నవదంపతులు. తనకు కొడుకు పుట్టిన సంతోషాన్ని కనీ వినీ ఎరుగని రీతిలో వ్యక్తం చేశాడు ఓ స్టార్ హీరో

  • Published Mar 31, 2024 | 4:54 PMUpdated Mar 31, 2024 | 4:54 PM
తన కొడుకు కోసం స్టార్ హీరో ఏం చేశాడో తెలుసా?

ఈ మద్య కాలంలో చాలామంది పచ్చబోట్టు వేయించుకోవడం చాలా ఫ్యాషన్ గా మారింది. తమకు ఇష్టమైన టాటూ వేయించుకొని దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మాద్యమాల్లో షేర్ చేయడం కామన్ అయ్యింది. కొంతమంది స్టైల్ కోసం టాటూలు వేయించుకుంటే.. కొంతమంది తాము అభిమానించే వారికోసం టాటూలు వేయించుకుంటారు. మరికొంత మంది అర్ధం పర్ధం లేని టాటూలు వేయించుకోవడం చూస్తూనే ఉన్నాం.  కొన్ని టాటూల్లో ఎన్నో అర్ధాలు వచ్చే విధంగా ఉంటాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎన్నో రకాల టాటూలు వేయించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఓ స్టార్ హీరో తన కొడుకుపై అభిమానాన్ని ఎంతో గొప్పగా చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల ‘12TH ఫెయిల్’ మూవీతో దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు హీరో విక్రాంత్ మాస్సే. ప్రస్తుతం ఈ కుర్ర హీరో పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. తన కుమారుడు పేరు వర్దాన్, పుట్టిన తేదీ తన చేతిపై టాటూ వేయించకొని తన కొడుకు పై ఉన్న ప్రేమను ఎంతో గొప్పగా చాటుకున్నాడు. దీనికి సంబంధించి ఫోటో ఇన్‌స్ట్రాలో షేర్ చేస్తూ.. ‘అడిషన్ ఆర్ అడిక్షన్? రెండింటినీ నేను ప్రేమిస్తా’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. నెటిజన్లు విక్రాంత్ మాస్సే ప్రశంసలు కురిపిస్తున్నాడు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో నటించిన విక్రాంత్ మాస్సే ఇటావట ‘12TH ఫెయిల్’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఈ చిత్రానికి పలు అవార్డులు, రివార్డులు వచ్చాయి.

Do you know what the star hero did for his son

ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రానికి గాను విక్రాంత్ కి తొలి ఫిలిమ్ ఫేర్ ఉత్తమ నటుడి క్రిటిక్ అవార్డు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఫిబ్రవరి 18, 2022 లో తాను ప్రేమించిన శీతల్ ఠాకూర్ ని పెళ్లి చేసుకున్నాడు. సంవత్సరం తర్వాత ఈ జంటకు ఫిబ్రవరి 7న పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ జంట బాబు కి ‘వర్దన్’ అని పేరు పెట్టుకున్నారు. తమకు కొడుకు పుట్టిన సంతోషాన్ని సోషల్ మాధ్యమాల్లో పంచుకున్నారు. తాజాగా తన కొడుకు పేరు, పుట్టిన తేదీ చేతిపై టాటూగా వేయించుకున్న ఫోటో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు కొడుకుపై ఉన్న ప్రేమను ఎంతో గొప్పగా చాటుకున్నావంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet