iDreamPost
android-app
ios-app

బాబోయ్.. గుర్తు పట్టలేనంతగా మారిన ‘ఆంధ్రుడు’ సినిమా హీరోయిన్!

  • Published Jun 07, 2024 | 4:31 PM Updated Updated Jun 07, 2024 | 4:31 PM

Andhrudu Movie Actress: ఇటీవల సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రెటీలు సోషల్ మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలు అభిమానులకు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక రకంగా సినిమాల్లో కన్నా సోషల్ మాద్యమాల్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారను.

Andhrudu Movie Actress: ఇటీవల సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రెటీలు సోషల్ మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలు అభిమానులకు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక రకంగా సినిమాల్లో కన్నా సోషల్ మాద్యమాల్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారను.

  • Published Jun 07, 2024 | 4:31 PMUpdated Jun 07, 2024 | 4:31 PM
బాబోయ్.. గుర్తు పట్టలేనంతగా మారిన ‘ఆంధ్రుడు’ సినిమా హీరోయిన్!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా చలామణి అయిన వాళ్లు ఇప్పుడు అస్సలు గుర్తు పట్టలేని విధంగా మారిపోతున్నారు. కొంతమంది నటీనటులు సినిమాల్లో పెద్దగా బిజీ లేకున్నా.. సోషల్ మాధ్యమాల్లో తమ అభిమానులతో వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు టి కృష్ణ తనయుడు గోపిచంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ మూవీ సక్సెస్ కాకపోవడంతో తర్వాత చిత్రాల్లో విలన్ గా నటించారు. నటుడిగా తనకంటూ మంచి పేరు రావడంతో తర్వాత యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గోపిచంద్ హీరోగా నటించిన ‘ఆంధ్రుడు’ మూవీ గుర్తుందా? లవ్ – యాక్షన్ డ్రామా 2005 లో రిలీజ్ అయ్యింది.ఈ మూవీలో హీరోయిన్ ఎంతో క్యూట్ గా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది.. ఇప్పుడు ఆ హీరోయిన్ ని చూస్తే ఆశ్చర్యపోతారు. వివరాల్లోకి వెళితే..

2005 లో పరుచూరి మురళి దర్శకత్వంలో రిలీజ్ అయిన ‘ఆంధ్రుడు ’ మూవీలో గోపీచంద్, గౌరిపండిట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, అద్భుతమైన యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఈ మూవీ చూస్తే అరె అప్పుడు ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యామా? అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ మూవీకి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన గౌరి పండిట్ గుర్తుందా? క్యూట్ లుక్స్ తో అప్పట్లో కుర్రకారుని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గౌరి పండిట్ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. మోడల్ గా మంచి గుర్తింపు రావడంతో ‘ఆంధ్రులు’ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత కాస్కో, ఆకాశ రామన్న, నిత్య పెళ్లి కొడుకు, హౌస్ ఫుల్ మూవీస్ లో నటించింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే.. బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదితో రిలేషన్ షిన్ లో ఉంటూ వచ్చింది. 2011, మార్చి 7న ఈ జంట వివాహం చేసుకున్నారు. సినిమాల్లో నటించకున్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది గౌరి పండిట్. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులకు షేర్ చేస్తుంది. ఈ అమ్ముడ ఎలా ఉందో చూడటానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş