iDreamPost
android-app
ios-app

Janhvi kapoor: జాన్వీ ముందు బిగ్ టార్గెట్! అందుకొని తీరాల్సిందే!

  • Published Sep 19, 2024 | 7:10 PM Updated Updated Sep 19, 2024 | 7:10 PM

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. అటు ప్రేక్షకులతో పాటు.. ఓవరాల్ ఇండస్ట్రీనే ఎదురుచూస్తున్నా మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. అయితే ఈ మూవీతోనే జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తుంది. మరి జాన్వీ ఈ టార్గెట్ ను అందుకుంటుందా!

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. అటు ప్రేక్షకులతో పాటు.. ఓవరాల్ ఇండస్ట్రీనే ఎదురుచూస్తున్నా మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. అయితే ఈ మూవీతోనే జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తుంది. మరి జాన్వీ ఈ టార్గెట్ ను అందుకుంటుందా!

  • Published Sep 19, 2024 | 7:10 PMUpdated Sep 19, 2024 | 7:10 PM
Janhvi kapoor: జాన్వీ ముందు బిగ్ టార్గెట్! అందుకొని తీరాల్సిందే!

అటు ప్రేక్షకులు కానీ, ఇటు ఇండస్ట్రీ వర్గాలు కానీ ఎదురుచూసేది సెప్టెంబర్ 27 కోసమే. వెండి తెరపై తారక్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటే.. దేవర మూవీ ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందా అని ఇండస్ట్రీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఎలాగైనా తారక్ ఎప్పటిలానే ఇరగదీసేస్తాడు. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ప్రేక్షకుల ఫోకస్ అంతా కూడా జాన్వీ పైనే ఉంది. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ అమ్మడు కొత్త. ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త హీరోయిన్స్ వస్తూ ఉంటారు.. వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మీద మాత్రమే ప్రేక్షకులు అంచనాలను పెట్టుకుంటారు. అలాంటి వారిలో జాన్వీ కూడా ఒకరు. మరి జాన్వీ దేవరతో ఈ అంచనాలను అందుకుంటుందా.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ లో జాన్వీ కపూర్ ఎంట్రీ హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఇలా అడుగుపెట్టడమే.. ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కాబట్టి ఈ మూవీ కచ్చితంగా జాన్వీ కెరీర్ ను డిసైడ్ చేస్తుందని చెప్పి తీరాల్సిందే. ఇప్పటివరకు బయటకు వచ్చిన కంటెంట్ లో జాన్వీ స్క్రీన్ ప్రెసెన్స్ ఓ మాదిరిగా బాగానే ఉంది. ఈ మూవీలో సంగం పాత్రలో జాన్వీ కనిపించింది. రంగస్థలం , పుష్ప సినిమాలలో రామలక్ష్మి , శ్రీవల్లి పాత్రలనే.. ఈ సంగం పాత్ర కూడా. అయితే రిలీజ్ చేసిన రెండు నిమిషాల ట్రైలర్ ను బట్టి జాన్వీ క్యారెక్టర్ ను అయితే డిసైడ్ చేయలేము. కాబట్టి ఈమె పాత్ర ఎలా ఉంటుందో.. దానికి తగిన న్యాయం చేస్తుందో లేదో తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. పైగా ఈ సినిమాలో రాయడానికి కష్టపడ్డ క్యారక్టర్ కూడా జాన్విదే అని డైరెక్టర్ కూడా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. అంటే సంగం పాత్ర నటనకు ఆస్కారం ఉండే పాత్ర అని అర్ధం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం జాన్వీ ముందున్న బిగ్ టార్గెట్ ను అందుకుని తీరాల్సిందే.

అయితే ఈ మూవీ నుంచి లాస్ట్ గా వచ్చిన దావుది సాంగ్ లో మాత్రం.. జాన్వీ తారక్ కు పోటీగా డ్యాన్స్ చేసింది. కాబట్టి ప్రేక్షకులు జాన్వీ మీద బాగానే హోప్స్ పెట్టుకున్నారు. కాబట్టి జాన్వీకి నెక్స్ట్ సరైన ఆఫర్లు రావాలన్నా, టాలీవుడ్ లో జాన్వీ మంచి పాత్రలతో కంటిన్యు అవ్వాలన్నా.. అంతా దేవర మూవీపై డిపెండ్ అయ్యి ఉందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక శ్రీదేవి నటవారసులుగా జాన్వీ ప్రూవ్ చేసుకుంటుందా లేదా అనేది ఈ మూవీతో దాదాపు ప్రేక్షకులు డిసైడ్ చేసేస్తారు. ఎలాగూ మూవీ రిలీజ్ కు ఎంతో సమయం లేదు కాబట్టి.. చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఇక దేవర ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి. మరి జాన్వీ కపూర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో… అనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss