iDreamPost
android-app
ios-app

ఈ ఆర్మీ ఆఫీసర్‌ ఆ స్టార్‌ హీరోయిన్‌ సోదరని మీకు తెలుసా?!

  • Published Jul 16, 2023 | 5:36 PM Updated Updated Jul 16, 2023 | 5:36 PM
  • Published Jul 16, 2023 | 5:36 PMUpdated Jul 16, 2023 | 5:36 PM
ఈ ఆర్మీ ఆఫీసర్‌ ఆ స్టార్‌ హీరోయిన్‌ సోదరని మీకు తెలుసా?!

మన దగ్గర సినిమాలు, రాజకీయాల్లో వారసత్వం తరతరాల వరకు కొనసాగుతుందని అందరికి తెలుసు. రాజకీయాల్లో అయినా ఒకరిద్దరూ వారసులుగా ఎంట్రీ ఇస్తారు. కానీ సినిమాల్లో మాత్రం ఈ వారసుల సంఖ్యకు అంతే ఉండదు. కుటుంబం నుంచి ఒక్కరు సక్సెస్‌ అయితే చాలు.. ఇక ఆ తర్వాత వారి వారసులు చాలా మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత వారి ప్రతిభ ఆధారంగానే ఇక్కడ వారి పొజిషన్‌ ఏంటి అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇందుకు పూర్తి భిన్నమైన వార్త. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఆమెకు ఓ అక్క ఉంది. చెల్లికి తగ్గట్టే ఎంతో అందంగా ఉంటుంది. ఆమె ఊ అంటే.. ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కడతాయి. కానీ ఆమె మాత్రం అవేవి వద్దనుకుని.. ఆడవాళ్లు భయపడే రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్మీ ఆఫీసర్‌గా రాణిస్తోంది. ఇంతకు ఆమె ఎవరంటే..

బాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది దిశా పటానీ. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘లోఫర్’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది ఈ భామ. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరలవుతోంది. అది కూడా ఆమె సోదరి గురించి. దిశాకున్న గుర్తింపు ప్రకారం చూసుకుంటే.. ఆమె సోదరి కూడా ఈ పాటికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉండేది. పైగా ఆమె కూడా దిశాలనే ఎంతో అందంగా ఉంటుంది. దాంతో అవకాశాలు కూడా బాగానే వచ్చేయి. కానీ దిశా సోదరి మాత్రం అందుకు భిన్నంగా.. సినిమాలను కాదనుకుని.. ఆర్మీ రంగంలోకి ప్రవేశించింది. తనే దిశా పటానీ అక్క ఖుష్బూ. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

దిశా కంటే వయసులో పెద్దయిన ఖుష్బూకు సంబంధించిన ఫొటో ఒకటి ఈ మధ్యకాలంలో నెట్టింట తెగ హల్చల్‌ చేస ఓ‍్తంది. ఈ ఫొటోలో దిశా పటానీతో పాటు ఆర్మీ డ్రెస్‌లో కనిపించి అందరికి షాక్‌ ఇచ్చింది ఆమె అక్క ఖుష్బూ. ఈ ఫొటో చూసిన వారు.. దిశా అక్క​ చాలా అందంగా ఉంది.. సోదరి ఇప్పటికే సినిమాల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది.. అలాంటిది ఖుష్బూ సినిమాల్లోకి రాకుండా.. ఆర్మీని ఎంచుకోవడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అంటూ ప్రశంసిస్తున్నారు. ఖుష్బూ పటానీ ప్రస్తుతం భారత సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో పని చేస్తున్నారు. సైన్యంలో చేరతామంటే మగవాళ్లనే వద్దంటారు.. ఇక ఆడవారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఖుష్బూ పటానీ.. ఆర్మీలో చేరడం నిజంగా గ్రేట్‌ అంటున్నారు నెటిజనులు.

ఇక ఇటు సినిమాల్లో రాణించాలన్నా.. అంటూ దేశానికి సేవ చేసే ఆర్మీలో కొనసాగాలన్నా.. ఎంతో ఫిట్‌గా ఉండాలి. ఇక ఈ విషయంలో ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరు అస్సలు వెనకడుగు వేయడం లేదు. ఖుష్బూ, దిశ ఇద్దరు ఫిట్‌నెస్‌ విషయంలో అస్సలు రాజీ పడరు. అందుకే అప్పుడప్పుడు ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అందరికీ ఉపయోగపడేలా తమ వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి వెకేషన్స్‌కు వెళ్లిన ఫొటోలు, కలిసి దిగిన చిత్రాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తారు. ఇక గతంలో దిశా పటానీ తన సోదరి ఖుష్బూ.. ఆర్మీ శిక్షణ రోజులకు సంబంధించి పలు ఫొటోలను పంచుకుంది. దేశానికి సేవ చేయడంలో తన సోదరి నిబద్ధతకు గర్వంగా ఫీలవుతున్నాను అంటూ ప్రశంసలు కూడా కురిపించింది. అంతే కాదు దిశా… ఖుష్బూని తన “వండర్ వుమన్” గా పిలవడం వారిద్దరి మధ్య ఉన్న బలమైన బంధాన్ని తెలుపుతుంది. ప్రస్తుతం ఖుష్బూ పటానీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Khushboo Patani 👸👑 (@khushboo_patani_)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş