iDreamPost
android-app
ios-app

ఠాగూర్ తరహాలో డాక్టర్ల మోసం వల్లే శ్రీహరి చనిపోయారు: డిస్కో శాంతి ఆవేదన!

  • Author ajaykrishna Published - 04:12 PM, Fri - 18 August 23
  • Author ajaykrishna Published - 04:12 PM, Fri - 18 August 23
ఠాగూర్ తరహాలో డాక్టర్ల మోసం వల్లే శ్రీహరి చనిపోయారు: డిస్కో శాంతి ఆవేదన!

తెలుగు ప్రేక్షకులు ఎన్నేళ్లు గడిచినా.. నటుడు శ్రీహరి గురించి మర్చిపోలేరు. ఇండస్ట్రీ ఉన్నంతకాలం శ్రీహరి నటుడిగా ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. నటుడిగా సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడే.. 2013లో శ్రీహరి ఆకస్మికంగా కన్నుమూయడంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పటికి ఆయన మరణించి దాదాపు పదేళ్లు అవుతోంది. దీంతో ఇటీవల శ్రీహరి మరణం గురించి ఆయన భార్య, నటి డిస్కో శాంతి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారాయి. 90లలో డిస్కో శాంతి నటిగా, స్పెషల్ నెంబర్స్ లో డాన్సర్ గా అందరికీ సుపరిచితమే. ఆ తర్వాత శ్రీహరిని పెళ్లి చేసుకుంది.

శ్రీహరితో పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటూ.. తన ఫ్యామిలీని చూసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో 2013లో శ్రీహరి చనిపోయాక తమ ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయిందని డిస్కో శాంతి ఆవేదన వ్యక్తం చేసింది. రీసెంట్ గా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “ముంబైలో ఓ సినిమా షూటింగ్ టైమ్ లో శ్రీహరి అకస్మాత్తుగా తీవ్రమైన అస్వస్థతకి గురయ్యారు. దీంతో ఆ సినిమా టీమ్ శ్రీహరిని ముంబైలోని లీలావతి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే.. ఆయన మరణించే కొన్ని గంటల ముందు డాక్టర్స్ చెకప్ చేశారు. కానీ.. ఆయన్ని చూడటానికి నేను ఎంత బ్రతిమాలినా అనుమతించలేదు.

ఆ టైమ్ లో ఆయనకు కొన్ని మెడిసిన్స్, ఇంజక్షన్స్ ఇచ్చారు. కాసేపటికి ఆయన కళ్లు, చెవులు, ముక్కు నుండి రక్తం వచ్చింది. నాకు హిందీ రాకపోవడంతో వాళ్లతో మాట్లాడటం కుదరలేదు. వెంటనే వారు ఆయన్ని వేరే గదికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడని కొన్ని గంటలు గడిచాక చెప్పి షాకిచ్చారు. అంతా ఠాగూర్ సినిమాలో జరిగినట్లు అనిపించింది. అక్కడకూడా డబ్బులు పూర్తిగా కట్టాకే చనిపోయాడని చెప్పారు. డాక్టర్స్ తప్పుడు ట్రీట్మెంట్ వల్లనే ఆయన చనిపోయారు. ఇదే హైదరాబాద్ లో అయితే.. తప్పకుండా బతికేవారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ పరిస్థితి దారుణం అయ్యింది. అప్పులు తీర్చేందుకు ఉన్న భూమి, కారు అమ్మేశాం. నా నగలు కూడా తాకట్టు పెట్టాను. మా ఆర్థిక పరిస్థితి బాగుంటే నా కొడుకు ఫారెన్ లో చదువుకునేవాడు. ప్రస్తుతం మాకు రెండు ఇళ్ల నుంచి వస్తున్న అద్దె మాత్రమే మా జీవనోపాధి.” అని డిస్కో శాంతి శ్రీహరి గురించి ఎమోషనల్ అయిపోయింది. మరి శ్రీహరి గురించి, వారి ఫ్యామిలీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş