iDreamPost
android-app
ios-app

‘గుంటూరు కారం’లో అతడు ఫైట్! ఘాటు మాత్రం కాస్త ఎక్కువగానే!

  • Published Nov 25, 2023 | 9:31 PM Updated Updated Nov 25, 2023 | 9:31 PM

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరెకెక్కుతున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో ఫైట్ సీన్ ఓ రేంజ్ లో ఉండనుందని టాక్.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరెకెక్కుతున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో ఫైట్ సీన్ ఓ రేంజ్ లో ఉండనుందని టాక్.

  • Published Nov 25, 2023 | 9:31 PMUpdated Nov 25, 2023 | 9:31 PM
‘గుంటూరు కారం’లో అతడు ఫైట్! ఘాటు మాత్రం కాస్త ఎక్కువగానే!

టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. మహేష్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మహేష్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందించే విధంగా సినిమాను తెరెకెక్కిస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ క్రమంలో గుంటూరు కారం మూవీలో ఫైట్ కు సంబంధించిన అంశం ఆసక్తిగా మారింది. అతడు సినిమాలోని ఫైట్ మాదిరిగా ఈ సినిమాలో భారీ ఫైట్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తున్నారు. వీరి కాంబినేషన్ లో ఇదివరకు అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాతో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేస్తోంది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, ఫస్ట్ సింగిల్ ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

గుంటూరు కారం మూవీలో ఫైట్ సీన్ గురించి ఆసక్తికర విషయం హల్ చల్ చేస్తోంది. మహేష్ నటించిన‘అతడు’ ‘ఖలేజా’ సినిమాల్లో మాదరిగా భారీ ఫైట్ ఉండబోతోందని వినిపిస్తోంది. ‘అతడు’ లో పొలం ఫైట్, ‘ఖలేజా’ లో ఎడారి ఫైట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘గుంటూరు కారం’ లో కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు ఆ రేంజ్ ఫైట్లు ఉంటాయట. టైటిల్ తగ్గట్టుగానే మహేష్ లుక్ ఉండడంతో ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కు కొదవ లేదని ఇట్టే తెలిసిపోతోంది. కాగా ఈ సినిమాలో విలన్ ఇంటి వద్ద వచ్చే ఓ ఫైట్ మరింత ఘాటుగానే ఉంటుందట. ఇటీవల విడుదలైన గ్లింప్స్ లో సుమో లేచే విజువల్ ఆ ఫైట్ కి సంబంధించిందే అని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఇది తెలిసి మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక గుంటూరు కారం మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss