హాయ్‌ నాన్నలో శృతి హాసన్‌ పాత్ర గురించి చెప్పిన దర్శకుడు!

హాయ్‌ నాన్న సినిమా ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో డిసెంబర్‌7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది..

హాయ్‌ నాన్న సినిమా ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో డిసెంబర్‌7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది..

న్యాచురల్‌ స్టార్‌ నాని – మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన హాయ్‌ నాన్న డిసెంబర్‌ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు శౌర్యవ్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులను కూడా సినిమా మెప్పించింది. కలెక్షన్ల పరంగా హాయ్‌ నాన్న సూపర్‌ హిట్‌ అనిపించుకుంటోంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రెండవ రోజు కూడా మంచి వసూళ్లనే రాబట్టింది.

దాదాపు 9.5 కోట్లను కలెక్ట్‌ చేసింది. ఇక, ఈ సినిమాలో ఓ సాంగ్‌లో కనిపించి మెప్పించారు శృతి హాసన్‌. అయితే, శృతి హాసన్‌ అప్పియరెన్స్‌పై సోషల్‌ మీడియాలో గత కొద్దిరోజులనుంచి ప్రచారం జరుగుతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన శృతిహాసన్‌ అప్పియరెన్స్‌పై క్లారిటీ ఇచ్చారు. హాయ్‌ నాన్నలో శృతి హాసన్‌ పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘‘ సినిమాలో ఆ పాట పరిస్థితికి తగ్గట్టుగా వస్తుంది. అది సెకండ్‌ హాఫ్‌లో వస్తుంది. సెకండ్‌ హాఫ్‌ వరకు శృతిగారి క్యారెక్టర్‌ ఎంటన్నది క్లారిటీ ఉండదు.

సెకండ్‌ హాఫ్‌లో అర్థం చేసుకుంటారు. పాట ఒకటే కాదు.. స్టోరీలో కూడా తను ఉంటుంది. ప్రస్తుతానికి ఓ పాట పెట్టాను’’ అని చెప్పుకొచ్చారు.సినిమా చూడని వాళ్లకు శృతి హాసన్‌ పాత్ర ఎంటన్నది ఓ క్వశ్చన్‌ మార్క్‌.. చూసిన వాళ్లకు ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. కాగా, కొత్త దర్శకుడు అయినప్పటికి శౌర్యవ్‌ హాయ్‌ నాన్న అద్భుతంగా తెరకెక్కించాడు. స్క్రీన్‌ ప్లే విషయంలో శౌర్యవ్‌ పని తీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కథను ఊహించని ట్విస్టులతో ముందుకు తీసుకెళ్లాడు. మొత్తానికి నాని పెట్టుకున్న నమ్మకానికి 100 శాతం న్యాయం చేశాడు. నాని ఖాతాలోకి మరో హిట్‌ను చేర్చాడు. ఇప్పుడు శౌర్యవ్‌ పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మారుమోగుతోంది.

ఆయన తర్వాత చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక, సినిమా కథ విషయానికి వస్తే.. ఎప్పటికైనా పెద్ద ఫొటోగ్రాఫర్‌ కావాలని అనుకుంటూ ఉంటాడు విరాజ్‌(నాని). ఓ ఫేమస్‌ ఫొటోగ్రాఫర్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తూ ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా యశ్న(మృణాల్‌ ఠాకూర్‌)ను చూస్తాడు. చూడగానే.. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటే ఇష్టంలేని యశ్న.. విరాజ్‌తో ప్రేమలో పడి ఓ బిడ్డను కూడా కంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత వారి జీవితం ఎలా మారింది అనేది మిగిలిన కథ. మరి, హాయ్‌ నాన్న సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments