శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. రూ. 1000 కోట్లతో ఆ సీరియల్ సినిమాగా!

రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ సీరియల్ ను సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడట డైరెక్టర్ శంకర్. పైగా అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకొచ్చాడు. ఇందులో ముగ్గురు పాన్ ఇండియా హీరోలను తీసుకోనున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ సీరియల్ ను సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడట డైరెక్టర్ శంకర్. పైగా అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకొచ్చాడు. ఇందులో ముగ్గురు పాన్ ఇండియా హీరోలను తీసుకోనున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

డైరెక్టర్ శంకర్.. ఈ పేరు సినిమా పోస్టర్ పై కనిపిస్తే చాటు.. ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టేవారు. అంతలా వారిని తన సినిమాలతో అట్రాక్ట్ చేశాడు. శంకర్ మూవీ రిలీజ్ అవుతుందంటే ఇండియా మెుత్తం దానిగురించే మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గత కొంతకాలంగా శంకర్ తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం మానేశాయి. అయినప్పటికీ.. అతడి క్రేజ్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. వరుసగా సినిమాలు చేస్తూ.. దూసుకెళ్తున్నాడు. తాజాగా భారతీయుడు 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ అగ్రదర్శకుడు. ఇందులో శంకర్ మార్క్ మిస్ అయ్యిందని, కాన్సెప్ట్ బాగుందని అభిమానులు రివ్యూలు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి తాజాగా వెల్లడించాడు. రూ. 1000 కోట్లతో సినిమా తీసే ప్లాన్ లో ఉన్నాడట. ఆ వివరాల్లోకి వెళితే..

భారతీయుడు 2.. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా వచ్చిన చిత్రం. జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. శంకర్ మార్క్ మిస్ అయ్యిందని, ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడంలో శంకర్ విఫలం అయ్యాడని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పి అందరికీ షాకిచ్చాడు ఈ స్టార్ డైరెక్టర్. ఓ సీరియల్ ను రూ. 1000 కోట్లతో సినిమాగా తీయాలని భారీ ప్లాన్ లో ఉన్నాడట. అవును.. వేల్పరి అనే నవల ఆధారంగా ఓ సీరియల్ తెరకెక్కింది. ఈ నవలను తమిళ చరిత్ర ఆధారంగా వెంకటేషన్ అనే కవి రచించాడు.

వేల్పరి అనే నవల ఆధారంగా తమిళంలో ఓ సీరియల్ తెరకెక్కింది. ఇప్పుడు ఇదే సీరియల్ ను డైరెక్టర్ శంకర్ సినిమాగా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. పైగా ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చాడు. ఏకంగా రూ. 1000 కోట్లతో ఈ మూవీని రూపొందించబోతున్నాడట. ఇక ఈ నవల కథ విషయానికి వస్తే.. వేల్పరి అనే రాజు 2 వేల సంవత్సరాల క్రితం పరంబునాడు అనే ప్రాంతాన్ని పాలించేవాడు. ఆ రాజ్యం కింద 300 గ్రామాలు ఉండేవి. ఈ గ్రామాలను ఆక్రమించుకోవడానికి అప్పటి చేర, చోళ , పాండ్య రాజవంశాలు దాడికి దిగుతారు.

ఇక ఆ దాడిని వేల్పరి రాజు ఒక్కడే ఎలా ఎదుర్కొన్నాడు. వారిని ఢీకొట్టేందుకు అతడు వేసిన ఎత్తుగడలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. ఇదే కథతో ఈ చిత్రాన్ని నిర్మించాలని శంకర్ ఉన్నాడట. ఇందుకోసం ముగ్గురు పాన్ ఇండియా హీరోలను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ గురించి ఇప్పటికే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, నెట్ ఫ్లిక్స్, పెన్ ఇండియా సంస్థలతో సంప్రదించినట్లు తెలుస్తోంది. అనుకున్న విధంగా అన్నీ జరిగితే.. భారతీయుడు 3 తర్వాత శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మరి శంకర్ 1000 కోట్ల చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments