iDreamPost
android-app
ios-app

ఆ విషయం నీ భర్తని అడుగు.. అమీర్ ఖాన్ భార్యకి సందీప్ రెడ్డి కౌంటర్స్!

  • Published Feb 03, 2024 | 1:38 PM Updated Updated Feb 03, 2024 | 1:38 PM

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కించిన సినిమా యానిమల్. ఈ సినిమా పై మొదటి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తునే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కూడా ఈ సినిమా పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కించిన సినిమా యానిమల్. ఈ సినిమా పై మొదటి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తునే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కూడా ఈ సినిమా పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Published Feb 03, 2024 | 1:38 PMUpdated Feb 03, 2024 | 1:38 PM
ఆ విషయం నీ భర్తని అడుగు.. అమీర్ ఖాన్ భార్యకి సందీప్ రెడ్డి కౌంటర్స్!

ఇటీవలే బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమా ‘యానిమల్’. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతు ఏకంగా రూ.900 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా పై మొదటలో ఎన్నో విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాను విమర్శించారు. ఎందుకంటే ఈ సినిమాలో చాలా బోల్డు కంటెంట్ ఉండటంతో పాటు, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో మాజీ భార్య కూడా యానిమల్ సినిమాపై విమర్శల వర్షం కురిపించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పై భారీ స్థాయిలో విమర్శలు గుప్పుమంటున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా యానిమల్ మూవీ పై విమర్శలు చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘బాహుబలి 2, కబీర్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు’. ప్రస్తుతం కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారాయి.

counters for amirkhan wife

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సందీప్ కు.. కిరణ్ రావు చేసిన విమర్శలకు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. కానీ, ఎక్కడ కూడా ఆమె పేరును ప్రస్తావించకుండానే గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఒకసారి అమిర్ ఖాన్, మాధురీ దీక్షిత్ నటించిన దిల్ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చారు. అలాగే సందీప్ మాట్లాడుతూ.. ‘నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్ ని వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్ సినిమాలో అమ్మాయిపై రేప్ కు ప్రయత్నించే సన్నివేశం ఎలా సృష్టించాడు. కానీ, ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. చివరికి అతడితోనే ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏంటీ ?.. ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో నాకు అర్థం కావడం లేదు’. అంటూ సందీప్ తెలిపారు. మరి, యానిమాల్ సినిమాపై అమిర్ మాజీ భార్య కిరణ్ చేసిన విమర్శల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş