iDreamPost
android-app
ios-app

Director Puri in ‘Godfather’అప్పుడు వినాయక్ ఇప్పుడు పూరి

  • Published Apr 09, 2022 | 12:16 PM Updated Updated Apr 09, 2022 | 12:16 PM
Director Puri in ‘Godfather’అప్పుడు వినాయక్ ఇప్పుడు పూరి

మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలని కోరుకోని వారు ఎవరుంటారు. అందులో పూరి జగన్నాధ్ కూడా ఒకరు. అప్పట్లో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఆటో జానీ టైటిల్ తో ఓ ఊర మాస్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసుకున్నారు కానీ ఫైనల్ వెర్షన్ చిరుని సంతృప్తి పరచలేక పోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. అయినా కూడా ఏదో ఒక రోజు మెగాస్టార్ కు యాక్షన్ కట్ చెబుతాననే నమ్మకం పూరిలో ఇంకా అది. దానికెలాగూ టైం పడుతుంది కాబట్టి ఈలోగా నటుడి రూపంలో ఆఫర్ ఇచ్చారు దర్శకుడు మోహన్ రాజా. మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా రూపొందుతున్న గాడ్ ఫాదర్ లో కీలకమైన జైలు ఎపిసోడ్లో పూరి నటించబోతున్నారు.

ఇలా వేరే డైరెక్టర్ ఇంకో దర్శకుడి సినిమాలో నటించడం కొత్తేమి కాదు కానీ చిరు మూవీస్ లో మాత్రం అరుదుగా జరుగుతుంది. అప్పుడెప్పుడో ఠాగూర్ లో వివి వినాయక్ కొన్ని నిమిషాల పాటు కనిపించే ఓ క్యారెక్టర్ చేశారు. నిడివి తక్కువే అయినా మంచి ప్రాధాన్యం దక్కింది. కాకపోతే దర్శకుడు ఆయనే. ఇప్పుడు పూరి మొదటి సారి స్క్రీన్ మీద కనిపించడం కోసం మోహన్ రాజా సూచనలు వినబోతున్నారు. ఇది సెకండ్ హాఫ్ లో వచ్చే ట్రాక్. చిరంజీవి పాత్ర జైలులో ఉన్నప్పుడు ఆయన కొలీగ్ గా పూరి జగన్నాధ్ కనిపిస్తాడు. దీని కోసమే ఎప్పుడు బారెడు జట్టుతో కనిపించే పూరి ఇటీవలే సన్నగా మిలిటరీ టైపు కటింగ్ చేయించారు.

గాడ్ ఫాదర్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వీలైతే ఆగస్ట్ 11న విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ క్యామియో చేస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో నయనతార సత్యదేవ్ సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. దశాబ్దాల తర్వాత చిరంజీవి సరసన హీరోయిన్, డ్యూయెట్లు లేకుండా వచ్చే మొదటి సినిమా ఇదే కావొచ్చు. హనుమాన్ జంక్షన్ తర్వాత పూర్తిగా కోలీవుడ్ కే పరిమితమైపోయిన మోహన్ రాజా గాడ్ ఫాదర్ తో గట్టిగా ప్రూవ్ చేసుకుని తెలుగు స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకునే టార్గెట్ లో ఉన్నారు. చూడాలి మరి

Jojobet GirişMadridbetMadridbetbetciomatbet girişgrandpashabetDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren Sitelerdeneme bonusugrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet