iDreamPost
android-app
ios-app

హనుమాన్‌కి ప్రాణం పోసిన క్లైమాక్స్ సీన్.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన డైరెక్టర్

  • Published Jan 12, 2024 | 6:28 PM Updated Updated Jan 12, 2024 | 6:28 PM

ఆడియెన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూసిన హనుమాన్ మూవీ నేడు థియేటర్లలో విడుదైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఆడియెన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూసిన హనుమాన్ మూవీ నేడు థియేటర్లలో విడుదైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  • Published Jan 12, 2024 | 6:28 PMUpdated Jan 12, 2024 | 6:28 PM
హనుమాన్‌కి ప్రాణం పోసిన క్లైమాక్స్ సీన్.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన డైరెక్టర్

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా తెరెకెక్కించిన సినిమా హనుమాన్. యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ఈ సినిమా నేడు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. హనుమాన్ మూవీ విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 100 శాతం ఇచ్చిపడేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. నేడు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో హనుమాన్ జోరు కొనసాగుతున్నది. అయితే ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది మాత్రం క్లైమాక్స్ సీన్. చివరి పది నిమిషాల క్లైమాక్స్ సీన్ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ క్లైమాక్స్ సీన్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

భారీ అంచనాలతో విడుదలైన హనుమాన్ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ గా హనుమాన్ సత్తా చాటుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమంతుడి వల్ల ఓ కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుదో అద్భుత రీతిలో చూపించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం పురాణ ఇతిహాసాలను స్టడీ చేశానని ప్రశాంత్ వర్మ ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ఎక్కడా వివాదాలకు తావులేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా సినిమాను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఎంతో శ్రమించినట్లు తెలిపారు. సినిమాలోని క్యారెక్టరైజేషన్ కోసం సంవత్సరం పాటు వర్కౌట్ చేసినట్లు తెలిపారు.

ఇక హనుమాన్ సినిమాకు హైలెట్ గా నిలిచిన క్లైమాక్స్ సీన్, గ్రాఫిక్స్ షాట్స్, వీఎఫ్ ఎక్స్ సీన్స్ కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డామని ప్రశాంత్ వర్మ తెలిపారు. హనుమాన్ క్యారెక్టర్ సినిమాలో చూపించాలనుకున్నప్పుడు దీనికి సంబంధించిన కొంతమందిని స్కాలర్స్ ను కూడా సంప్రదించామని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఈ సినిమా అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. మూవీలోని చాలా సీన్స్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ లో ఆంజనేయస్వామి షాట్స్ అయితే ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom