iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ మూవీ! ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ తో?

  • Published Apr 18, 2024 | 9:49 PM Updated Updated Apr 18, 2024 | 9:49 PM

Prasanth Varma Bollywood Movie: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యాడు అంటున్నారు.

Prasanth Varma Bollywood Movie: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యాడు అంటున్నారు.

  • Published Apr 18, 2024 | 9:49 PMUpdated Apr 18, 2024 | 9:49 PM
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ మూవీ! ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ తో?

టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అటు బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. అతను తీసిన హనుమ్యాన్ సినిమాకి పాన్ ఇండియా లెవల్లో మంచి రెస్పాన్స్ లభించింది. చిన్న సినిమాగా వచ్చిన హనుమ్యాన్ అతి పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు జై హనుమాన్ తో మరో బిగ్ హిట్ కొడతానని ప్రశాంత్ వర్మ మాటిస్తున్నాడు. అయితే ఈ గ్యాప్ లో ప్రశాంత్ వర్మ గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ యంగ్ డైరెక్టర్ బాలీవుడ్ బాట పడుతున్నాడని తెలుస్తోంది. అది కూడా ఓ స్టార్ హీరోతో ఈ మూవీ ఉండబోతోందని చెబుతున్నారు.

ప్రశాంత్ వర్మ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. అందులో హనుమంతు, హనుమాన్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది సూపర్ హీరోలు ఉంటారు. కాబట్టి ప్రశాంత్ వర్మ బాలీవుడ్ బాట పట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అతి తక్కువ బడ్జెట్ తో ప్రశాంత్ వర్మ తీసిన హనుమ్యాన్ సినిమాకి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి అప్లాజ్ లభించింది. ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసలు కురిపించారు. అలాగే నిర్మాతలు, హీరోలు కూడా ప్రశాంత్ వర్మ వర్క్ కి, విజన్ కి ఫిదా అయిపోయారు. అలా ఫిదా అయిన ఓ బాలీవుడ్ స్టార్ హీరోనే ఇప్పుడు ప్రశాంత్ వర్మతో సినిమా తీయడానికి ఉవిళ్లూరుతున్నాడు అంటున్నారు.

ఈ వార్తల్లో చెప్పుకున్న బాలీవుడ్ హీరో మరెవరో కాదు రణ్ వీర్ సింగ్. ఈ స్టార్ హీరో ప్రశాంత్ వర్మ వర్క్ కి మెస్మరైజ్ అయిపోయి అతనితో వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడంట. అలాగే ప్రశాంత్ వర్మ కూడా రణ్ వీర్ సింగ్ తో మూవీ చేసేందుకు సుముఖంగానే ఉన్నాడని చెప్తున్నారు. తనకి బాగా కలిసొచ్చిన మైథాలజీ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. పైగా ఈ మూవీకి ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ అని క్రేజీ వార్త వైరల్ అవుతోంది. రూ.50 కోట్ల బడ్జెట్ తోనే హనుమ్యాన్ లాంటి అద్భుతాన్ని సృష్టించాడు. ఇప్పుడు రూ.200 కోట్ల బడ్జెట్ ఇస్తే హాలీవుడ్ కూడా అవాక్కయ్యేలా మూవీ తీస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రణ్ వీర్ సింగ్ కి ఉన్న మార్కెట్ కి ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టడం పెద్ద రిస్క్ కూడా కాదు అంటున్నారు. మొత్తానికి ఈ వార్త నిజమైతే సందీప్ రెడ్డి వంగా తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అద్భుతాలు సృష్టిస్తున్న డైరెక్టర్ జాబితాలోకి ప్రశాంత్ వర్మ కూడా చేరిపోతాడు. తెలుగు ఆడియన్స్ అది నిజం కావాలి అని కోరుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ బిజీలో పడి.. జై హనుమాన్ డిలే చేయద్దు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. జై హనుమాన్ మూవీ విషయానికి వస్తే.. ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోయే అద్భుతమైన మాస్టర్ పీస్ లా తెరకెక్కిస్తానంటూ ప్రశాంత్ వర్మ హామీ ఇచ్చాడు. ప్రీ లుక్ చూస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనిపిస్తోంది. మరి.. బాలీవుడ్ కి ప్రశాంత్ వర్మ వెళ్తే బాగుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş