ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కంచి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించిన ప్రముఖ దర్శకుడు కన్నుమూయడంతో విషాదం నెలకొంది.

ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కంచి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించిన ప్రముఖ దర్శకుడు కన్నుమూయడంతో విషాదం నెలకొంది.

ఇటీవల హాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలో సినీ నటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. అనారోగ్య సమస్యలు, వయోభారం, రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, కెరీర్ సరిగా లేక ఆర్థిక సమస్యలు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పపడంతో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి మంచిపేరు సంపాదించిన డైరెక్టర్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకులు ప్రకాశ్ కొలేరి (65) కేరళలోని వాయనాడ్ లో తన నివాసం లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన వాయినాడ్ లోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. రెండు రోజులుగా ఆయన బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం రావడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఆయన విగతజీవిగా కనిపించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించారు. ప్రకాశ్ కొలేరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ప్రకాశ్ కొలేరి 1987 లో తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘మిజియితలిల్ కన్నిరుమయి’ హిట్ టాక్ తెచ్చుకోవడమేకాదు.. ఆయనకు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. 1999 లో రిలీజ్ అయిన ‘వరుణ్ వారథిరికిల్ల’ మూవీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. అవన్ ఆనందపద్మనాభన్, వరుమ్ వరతిరికిల్ల ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. సుదీర్ఘ విరామం తర్వాత అంటే దాదాపు 14 ఏళ్ల తర్వాత 2013లో ‘పాట్టు పుస్తకం’ మూవీకి దర్శకత్వం వహించారు. ఇదే ఆయన కెరీర్ లో చివరి చిత్రం. దర్శకుడిగానే కాకుండా స్క్రిప్ట్ రైటర్, నటుడిగా సత్తా చాటారు. ప్రకాశ్ కొలేరి మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

Show comments