Jailer 2: జైలర్ 2 గురించి లేటెస్ట్ అప్డేట్! డైరెక్టర్ నెల్సన్ ఏమన్నాడంటే?

Nelson Dilip Kumar update on Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దాంతో సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. అయితే తాజాగా జైలర్ 2 పై అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.

Nelson Dilip Kumar update on Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దాంతో సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. అయితే తాజాగా జైలర్ 2 పై అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.

సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం అన్నది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ ట్రెండ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలతో పాటుగా చిన్న హీరోల చిత్రాలు కూడా సీక్వెల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ రజినీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో వచ్చిన చిత్రం ‘జైలర్’. 2023లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే గాక.. దాదాపు రూ. 700 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఇక దీనికి పార్ట్ 2 రానున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. తాజాగా జైలర్ 2 గురించి అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్.

‘జైలర్’ సూపర్ స్టార్ రజినీకాంత్-నెల్సన్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ. 700 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అప్పట్లోనే ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు పార్ట్ 2పై ఎలాంటి అప్డేట్ ఇచ్చింది లేదు. కానీ.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. “జైలర్ 2 స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రానికి సంబంధించి ఒక నెలలోనే భారీ ప్రకటన చేయడానికి సిద్ధమవుతోంది. దాని కోసం అందరు రెడీగా ఉండండి” అని నెల్సన్ చెప్పుకొచ్చాడు.

కాగా.. జైలర్ 2 షూటింగ్ అక్టోబర్ 2న ప్రారంభం కాబోతోందని గత కోన్ని రోజులుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక డైరెక్టర్ నెల్సన్ లేటెస్ట్ కామెంట్స్ తో.. ఈ తేదీనే పార్ట్ 2 స్టార్ట్ అవ్వబోతోందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సీక్వెల్ కు గతంలోనే నెల్సన్ అడ్వాన్స్ అందుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో  ‘వెట్టయన్’ చేస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 10 విడుదల కాబోతోంది. దీంతో పాటుగా లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో ‘కూలీ’ చేస్తున్నాడు.

Show comments