Nag Ashwin Specially Thanked This Young Girl: నాగ్ అశ్విన్ అంత స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పిన ఈ అమ్మాయి ఎవరంటే?

నాగ్ అశ్విన్ అంత స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పిన ఈ అమ్మాయి ఎవరంటే?

Director Nag Ashwin Specially Thanked This Young Girl: స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ సినిమానే కాకుండా.. బుజ్జి అండ్ భైరవ అనే యానిమేటెడ్ సిరీస్ ని కూడా విడుదల చేస్తున్నారు. అందుకోసం ఒక పెద్ద ఈవెంట్ కూడా నిర్వహించారు. ఆ ఈవెంట్ లో ఒక అమ్మాయికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు డైరెక్టర్.

Director Nag Ashwin Specially Thanked This Young Girl: స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ సినిమానే కాకుండా.. బుజ్జి అండ్ భైరవ అనే యానిమేటెడ్ సిరీస్ ని కూడా విడుదల చేస్తున్నారు. అందుకోసం ఒక పెద్ద ఈవెంట్ కూడా నిర్వహించారు. ఆ ఈవెంట్ లో ఒక అమ్మాయికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు డైరెక్టర్.

నాగ్ అశ్విన్.. ప్రస్తుతం వరల్డ్ ఆఫ్ సినిమాలో ఈ యంగ్ డైరెక్టర్ పేరు మారుమోగుతోంది. ప్రభాస్ తో కలిసి నాగ్ అశ్విన్ తీస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ గురించి ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ బజ్ ఉంది. ఇప్పుడు వీళ్లు కల్కి సినిమానే కాకుండా.. బుజ్జి అంట్ భైరవా అంటూ యానిమేటెడ్ సిరీస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అందుకోసం ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్ లో నాగ్ అశ్విన్ ఒక అమ్మాయిని ప్రత్యేకంగా ప్రస్తావిచాడు. అంతేకాకుండా.. ఆ అమ్మాయికి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పాడు. ఇప్పుడు అందరూ అసలు ఆ అమ్మాయి ఎవరూ అంటూ వెతుకులాట మొదలు పెట్టారు.

కల్కీ 2898 ఏడీ మూవీ టీమ్ నుంచి బుజ్జి అండ్ భైరవ అనే యానిమేటెడ్ సిరీస్ వస్తున్న విషయం తెలిసిందే. ఆ సిరీస్ కి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఇది దాదాపుగా కల్కీ సినిమాని పోలి ఉంటుంది. అదే కల్కీ వరల్డ్ లో ఈ కథ మొత్తం నడుస్తూ ఉంటుంది. అందుకు సంబంధించి ఒక పెద్ద రిలీజ్ ఈవెంట్ ని కూడా ఏఎంబీ సినిమాస్ లో ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా నాగ్ అశ్విన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఒక యానిమేటెడ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా కొత్తగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఇప్పటివరకు సినిమాలు చేసినందుకు మూవీ అంత కష్టంగా ఎప్పుడూ అనిపించలేదు అన్నాడు. కానీ, ఈ యూనిమేటెడ్ సిరీస్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని చెప్పాడు. ఎవరైతే యానిమేటర్స్ ఉన్నారో వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాకుండా ఈ ఈవెంట్లో నాగ్ అశ్విన్ ఒక అమ్మాయిని ప్రత్యేకంగా అభినందించాడు. ప్రస్తుతం ఈ అమ్మాయి నెట్టింట వైరల్ గా మారింది. అసలు నాగ్ అశ్విన్ అంత ప్రత్యేకంగా అభినందనలు ఎందుకు చెప్పాడు అంటూ అంతా తెగ థింక్ చేస్తున్నారు. ఆ అమ్మాయి మరెవరో కాదు.. సహేన్ ఉపాధ్యాయ. ఆమె అసిస్టెండ్ డైరెక్టర్. ఈ యానిమేటెడ్ సిరీస్ కి సహేన్ ఉపాధ్యాయ్ రైటర్ అండ్ కో డైరెక్టర్ కూడా. సాధారణంగా యానిమేటెడ్ సినిమా అంటే దానికోసం ఎంతో మందిని కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఒక టఫ్ఫెస్ట్ టాస్క్ ని ఈ అమ్మాయి ఒక్కతే తన సొంతంగా చేసింది అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

తాను ఎక్కడున్నా పైకి లేచి.. ఎక్కడుందో అందరికీ తెలిసేలా చేయాలంటూ నాగ్ అశ్విన్ చెప్పాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి నెట్టింట వైరల్ అయిపోతోంది. ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్లో నాగ్ అశ్విన్ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడంతో ఆ అమ్మాయి ఇప్పుడు నెట్టింట సెలబ్రిటీ అయిపోయింది. ఇంక బుజ్జి అండ్ భైరవ విషయానికి వస్తే.. సినిమాలో కూడా బుజ్జి- భైరవ బాండింగ్ కీలకంగా మారబోతోంది. తాను తయారు చేసిన ఒక సూపర్ కార్ కి ఈ రోబోని అటాచ్ చేసి.. దానికి బుజ్జి అని పేరు పెట్టేశాడు. ఇప్పుడు ఆ లైన్ తోనే ఈ యానిమేటెడ్ సిరీస్ ని కూడా తీసుకొచ్చారు. మరి.. నాగ్ అశ్విన్ ఈ అమ్మాయికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments