iDreamPost
android-app
ios-app

రాజాసాబ్‌ రిలీజ్‌ డేట్ పై న్యూ అప్‌డేట్.. డైరెక్టర్ మారుతి ఏం చెప్పారంటే?

  • Published Jan 30, 2024 | 10:22 AM Updated Updated Jan 30, 2024 | 10:22 AM

డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ చిత్రాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ విడుదలపై డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?

డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ చిత్రాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ విడుదలపై డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?

  • Published Jan 30, 2024 | 10:22 AMUpdated Jan 30, 2024 | 10:22 AM
రాజాసాబ్‌ రిలీజ్‌ డేట్ పై న్యూ అప్‌డేట్.. డైరెక్టర్ మారుతి ఏం చెప్పారంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కొంత కాలంగా హిట్స్ లేక నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు రెబల్ స్టార్ ఫుల్ మీల్స్ అందించారు. క్రిస్మస్ కానుకగా విడుదలైన సలార్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ సాలిడ్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు హీరో ప్రభాస్. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా రాజాసాబ్ అనే కొత్త మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల సంక్రాంతి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే తాజాగా రాజాసాబ్ విడుదలపై డైరెక్టర్ మారుతీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక రాజాసాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో డార్లింగ్ ప్రభాస్ మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. లుంగీ పైకెత్తి ఊరమాస్ లుక్ తో ప్రభాస్ అదరగొట్టారు. ఇక మాస్ జాతర షురువైనట్టే అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా రాజాసాబ్ విడుదలపై న్యూ అప్ డేట్ అందించారు డైరెక్టర్ మారుతీ. తాజాగా ట్రూ లవర్‌ టీజర్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మారుతి రాజాసాబ్‌ విడుదలపై స్పందించారు. టైమ్ వచ్చినప్పుడు అదే రిలీజ్ అవుతుంది. మన చేతుల్లో ఏం లేదని మారుతీ తెలిపారు. ఇక మారుతీ స్టేట్ మెంట్ తో రాజా సాబ్ విడుదల తేదీపై ఇంకా ఏవిధమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

maruthi clarity on rajasaab movie

కాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రాజా సాబ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కల్కి మూవీలో బిజీగా ఉన్నారు. ఫిక్షనల్‌ కథతో భారీ స్థాయిలో దీనిని తీర్చిదిద్దుతున్నారు డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌. ఇక ఈ సినిమా విడుదల తర్వాతనే రాజాసాబ్ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ఇతర అప్ డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి రాజాసాబ్ విడుదలపై డైరెక్టర్ మారుతీ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom