రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. హైకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్ క్రిష్

హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

గచ్చిబౌలిలోని రాడిషన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో డ్రగ్ సప్లయర్ అబ్బాస్ తో సహా మరో పది మందిపై కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ పార్టీ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో మరోసారి కలకలం రేపింది. అయితే ఈ కేసులో అబ్బాస్ ను నార్కోటిక్ పోలీసులు విచారణ చేయగా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి పేరును బయటపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాడిసన్ డ్రగ్స్ పార్టీలో మూవీ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో క్రిష్ ను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇక్కడే కీలక మలుపు చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్రిష్ తో పాటు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్ అట్లూరి, సందీప్ తోపాటు సినీనటి లిషి, శ్వేత, నీల్ తదితరులు కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో శేరిలింగం పల్లి బీజెపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు, మంజీర మాల్ ఓనర్ వివేకానంద పట్టుబడిన విషయం తెలిసిందే. డైరెక్టర్ క్రిష్ గజ్జెల వివేకానంద స్నేహితులు. కాగా వివేకానంద నిర్వహిస్తున్న పార్టీలకు క్రిష్ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్‌లో 8వ నిందితుడిగా క్రిష్ పేరును చేర్చారు పోలీసులు. ఈ క్రమంలో క్రిష్ ను విచారణకు పిలిచి వైద్య పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. నేడు పోలీసుల ముందు హాజరుకానున్న నేపథ్యంలో క్రిష్ తాను ముంబైలో ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని.. రెండ్రోజులు సమయం కావాలని కోరారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

Show comments