iDreamPost
android-app
ios-app

ప్రముఖ దర్శకుడి ఇంట్లో పెళ్లి భాజాలు.. ఫోటోలు వైరల్

  • Published Apr 24, 2024 | 6:16 PM Updated Updated Apr 24, 2024 | 6:16 PM

ఇటీవల దర్శకుడు శంకర్ తన పెద్ద కుమార్తెకు పెళ్లి చేసిన సంగతి విదితమే. ఇప్పుడు మరో దర్శకుడు కమ్ నటుడు ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల దర్శకుడు శంకర్ తన పెద్ద కుమార్తెకు పెళ్లి చేసిన సంగతి విదితమే. ఇప్పుడు మరో దర్శకుడు కమ్ నటుడు ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

  • Published Apr 24, 2024 | 6:16 PMUpdated Apr 24, 2024 | 6:16 PM
ప్రముఖ దర్శకుడి ఇంట్లో పెళ్లి భాజాలు.. ఫోటోలు వైరల్

ఇండస్ట్రీలో వరుసగా భాజా భంజత్రీలు మోగుతున్నాయి. ఈ ఏడాదిలో ప్రముఖ సినీ సెలబ్రిటీల ఇళ్లల్లో పెళ్లి సందడి నెలకొంది. రకుల్ ప్రీత్ సింగ్, కృతి కర్బంద ఈ ఏడాది కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. తాము ప్రేమించిన వ్యక్తుల్ని మనువాడారు. అలాగే మరో టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను కూడా అత్యంత రహస్యంగా ప్రియుడ్ని వివాహం చేసుకుంది. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన వెంకటేశ్ ఇంట్లో కూడా సన్నాయి మోత మోగింది. అతడి రెండో కుమార్తె హవ్యవాహిని వివాహం ఇటీవలే జరిగిన సంగతి విదితమే. అలాగే ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం జరిగింది. ఈ వేడుకకు కోలీవుడ్ అతిరధ మహారధులందరూ హాజరయ్యారు. ఈ రోజు మరో నటి అపర్ణా దాస్.. మంజుమ్మల్ బాయ్స్ హీరోను మనువాడింది.

ఇప్పుడు మరో నటుడు కమ్ దర్శకుడి ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. ప్రముఖ దర్శక నటుడు చేరన్ పెద్ద కుమార్తె నివేద ప్రియదర్శిని పెళ్లి జరిగింది. ఈ నెల 22న చెన్నైలో ఈ వివాహం జరగ్గా.. ప్రముఖ దర్శకులంతా ఈ వేడుకకు హజరయ్యారు. ప్రియదర్శిని పెళ్లి వ్యాపార వేత్త సురేశ్ ఆదిత్యతో జరిగింది. తన కూతురి పెళ్లికి విచ్చేసిన అతిధుల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న దర్శకుడు.. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు కేఎస్ రవికుమార్, సీమన్, సముద్ర ఖని, పాండి రాజ్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చేరన్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ స్టార్ చేశాడు.

ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. సినిమాల్లో నటిస్తూనే.. డైరెక్షన్ చేశాడు. అలా తన డైరెక్షన్‌లో సూపర్ డూపర్ హిట్ కొట్టడమే కాదు.. అతడికి పేరు తెచ్చిన చిత్రం ఆటోగ్రాఫ్. ఈ సినిమా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. ఇదే సినిమా రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ పేరుతో రీమేక్ చేశాడు. ఆ తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. 90 రోజులు ఉండి తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కమల్ హాసన్ ప్రశంసలు పొందాడు. ప్రస్తుతం కన్నడ నటుడు కిచ్చా సుదీప్ తో కలిసి వర్క్ చేస్తున్నాడు. ఇందులో కేజీఎఫ్ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom