iDreamPost
android-app
ios-app

పొలిమేర ఫ్రాంఛైజీల గురించి ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌!

  • Published Oct 27, 2023 | 10:13 AM Updated Updated Oct 27, 2023 | 10:13 AM

పొలిమేర-2 నవంబర్‌ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిమేర-2కు సంబంధించిన ట్రైలర్‌ కొద్దిరోజుల క్రితం విడుదల అయింది. ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

పొలిమేర-2 నవంబర్‌ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిమేర-2కు సంబంధించిన ట్రైలర్‌ కొద్దిరోజుల క్రితం విడుదల అయింది. ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

  • Published Oct 27, 2023 | 10:13 AMUpdated Oct 27, 2023 | 10:13 AM
పొలిమేర ఫ్రాంఛైజీల గురించి ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌!

కొన్ని సినిమాలకు కోట్లు పెట్టి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. సినిమా బాగుందన్న టాక్‌ వస్తే చాలు.. జనంలోకి అలా వెళ్లుపోతుందంతే. కేవలం మౌత్‌ పబ్లిసిటీ ద్వారా సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు.. అది కూడా చిన్న సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో పొలిమేర ముందు వరుసలో ఉంటుంది. కరోనా సమయంలో ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా మౌత్‌ పబ్లిసిటీ ద్వారా పిచ్చి పాపులారిటీ తెచ్చుకుంది. మొదటి భాగానికి వచ్చిన స్పందనతో చిత్ర బృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండో భాగాన్ని తెరకెక్కించింది.

పొలిమేర-2 నవంబర్‌ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిమేర-2కు సంబంధించిన ట్రైలర్‌ కొద్దిరోజుల క్రితం విడుదల అయింది. ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే పొలిమేర సినిమా ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పారు దర్శకుడు అనిల్‌. మొదటి పార్టు కంటే రెండో పార్టు 10 రెట్లు అద్భుతంగా ఉంటుందని అన్నారు. రెండో పార్టులో భయపెట్టే సన్నివేశాలు చాలా ఉంటాయన్నారు. మూడో పార్టు కథ రాయటం మొదలుపెట్టానని చెప్పారు.

రెండో పార్టులో వదిలిన లూప్‌ హోల్స్‌, బ్లాక్స్‌ను సరి చేసుకుంటూ మూడో పార్టు కథ రాసుకుంటున్నానని అన్నారు. మూడో పార్టు రెండు పార్టులను మించి ఉంటుందని, స్టార్‌ హీరోలు కూడా నటించే అవకాశం ఉందని తెలిపారు. హిట్‌ సినిమాలాగా ఈ పొలిమేర కూడా వరుస భాగాలతో ప్రేక్షకులను భయపెట్టనుంది. అయితే, ఒకే కథా వస్తువుతో ప్రేక్షకులను కంటిన్యూయస్‌గా భయపెట్టడం అంత సులభం కాదు. దాన్ని దర్శకుడు ఎలా అధిగమిస్తాడో వేచి చూడాల్సిందే. మరి, పొలిమేర ఫ్రాంఛైజీలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom