iDreamPost
android-app
ios-app

‘బలగం’ సరికొత్త రికార్డు.. 100 ఇంటర్నేషనల్ అవార్డులు సొంతం!

  • Author Soma Sekhar Published - 12:58 PM, Wed - 5 July 23
  • Author Soma Sekhar Published - 12:58 PM, Wed - 5 July 23
‘బలగం’ సరికొత్త రికార్డు.. 100 ఇంటర్నేషనల్ అవార్డులు సొంతం!

సినీ ప్రేక్షకులకు కథ కనెక్ట్ అయితే చాలు.. ఆ సినిమాను గుండెల్లో పెట్టుకుంటారు. అలా అభిమానుల హృదయాలను గెలుచుకున్న మూవీలు భారీ కలెక్షన్లు సైతం సాధిస్తాయి. ఈ మధ్యకాలంలో అలా అభిమానుల మనసులను కొల్లగొట్టి, వారి చేత కంట తడి పెట్టించిన సినిమా బలగం. కుటుంబ విలువలను, బంధాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ వేణు. ఇక ఈ మూవీకి వచ్చిన అవార్డులను, కలెక్షన్లను చూసి సినీ పండితులే ఆశ్చర్యానికి గురైయ్యారు. తాజాగా మరో చరిత్ర సృష్టించింది బలగం మూవీ. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న బలగం మూవీ.. మరో మైలురాయిని అందుకుంది.

బలగం.. జబర్దస్త్ కమెడియన్ వేణు మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన గ్రామీణ కుటుంబ దృశ్య కావ్యం. తెలంగాణ పల్లె జీవనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు వేణు. మనిషి మరణం తర్వాత జరిగే తంతును కథగా మలిచిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. దాంతో బలగం మూవీకి అవార్డులు వరుసగా క్యూ కట్టాయి. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో సత్తా చాటుతూ.. వస్తున్న బలగం ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. బలగం మూవీకి మెుత్తంగా 100 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.

ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ అఫీషియల్ గా ప్రకటించింది. దాంతో ఈ ఘనత సాధించిన తెలుగు సినిమాగా అరుదైన రికార్డు నెలకొల్పింది బలగం మూవీ. ” మా అద్భుత జర్నీకి ఇది గుర్తింపు. మనం గతంలో 100 రోజులు ఆడిన సినిమాలు, 100 సెంటర్లలో ఆడిన సినిమాలు, 100 కోట్లు వసూల్ చేసిన మూవీలను చూశాం. కానీ మేం ఇప్పుడు 100+ ఇంటర్నేషనల్ అవార్డులను సాధించిన చిత్రాన్ని నిర్మించా. ఎన్ని రకాలుగా చూసుకున్నా బలగం మాకు ప్రత్యేకమైన చిత్రం” అని సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు మూవీ యూనిట్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి