iDreamPost
android-app
ios-app

ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? ఒకప్పుడు స్మితా సబర్వాల్ దగ్గర పని చేసి.. ఇప్పుడు?

నీట్ గా టక్ చేసుకుని.. బూట్లు వేసుకుని సైడ్ ఫోజులో నిలబడిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? ఇతనిప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రముఖ కమెడియన్. జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. ఒకప్పుడు ఐఏఎస్ స్మితా అగర్వాల్ దగ్గర కూడా పని చేశాడు. ఎవరో గుర్తుపట్టారా?

నీట్ గా టక్ చేసుకుని.. బూట్లు వేసుకుని సైడ్ ఫోజులో నిలబడిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? ఇతనిప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రముఖ కమెడియన్. జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. ఒకప్పుడు ఐఏఎస్ స్మితా అగర్వాల్ దగ్గర కూడా పని చేశాడు. ఎవరో గుర్తుపట్టారా?

ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? ఒకప్పుడు స్మితా సబర్వాల్ దగ్గర పని చేసి.. ఇప్పుడు?

సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం మామూలే. ఇప్పుడు ఓ సెలబ్రిటీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ ఫోటోలో ఉన్న నటుడ్ని గుర్తుపట్టారా? ఇతను ఒక స్టార్ కమెడియన్. ఒకప్పుడు ఐఏఎస్ స్మితా సబర్వాల్ దగ్గర పని చేశాడు. ఇతను మాట్లాడితే రచ్చ, కామెడీ చేస్తే రచ్చ, ఏం చేసినా రచ్చ. రచ్చనే తన పేరు పక్కన చేర్చుకున్న రచ్చోడు. ఎవరో గుర్తుపట్టారా? 

తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని హన్మకొండలో 1982లో జూలై 27న జన్మించిన ఈ కుర్రాడు.. హన్మకొండలోని విద్యానికేతన్ హైస్కూల్లో చదువుకున్నారు. ఎస్.వి.ఎస్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నతనం నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీకి వెళ్లి తానేంటో నిరూపించుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు. కమెడియన్ అయ్యి అందరినీ నవ్వించాలని గట్టిగా ఫిక్స్ అయిన ఈ కుర్రాడు.. దూరదర్శన్ లో చార్లీ చాప్లిన్ ఎపిసోడ్స్ చూసేవాడు. వినాయకచవితి మండపాల్లో ప్రదర్శించే హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆకర్షితుడైన ఈ కుర్రాడు.. ఆ స్టేజ్ పై తాను కూడా ఏదోటి చేసి జనానికి వినోదం పంచాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మిమిక్రీ నేర్చుకున్నాడు. అనేక స్టేజ్ ల మీద మిమిక్రీతో అలరించాడు.

అయితే ఈ కుర్రాడి ఆసక్తిని గమనించిన తన చెల్లెలు కొంత డబ్బులు ఇచ్చి హైదరాబాద్ పంపించింది. ఉదయభాను యాంకర్ గా చేస్తున్న వన్స్ మోర్ ప్లీజ్ అనే ప్రోగ్రాంలో తొలిసారిగా మిమిక్రీ ప్రదర్శన ఇచ్చాడు. ఆ సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ రాకపోవడంతో హైదరాబాద్ నుంచి తిరిగి వరంగల్ వచ్చేశాడు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో చేరాడు. కొంత కాలం ఐఏఎస్ స్మితా సబర్వాల్ దగ్గర పని చేశాడు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి దుబాయ్ వెళ్లిపోయాడు. అక్కడ రేడియో జాకీగా చేరాడు. నవ్వుల నల్లబాలు పేరుతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ చేసిన కార్యక్రమానికి విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చేసాడు.

Rach ravi childhood photo

పుత్తడి బొమ్మ, శిఖరం సీరియల్స్ కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న దర్శకుడు క్రిష్ తండ్రి.. చమ్మక్ చంద్ర ఇంటిలో జబర్దస్త్ ఆడిషన్స్ నిర్వహించారు. ఆ ఆడిషన్స్ లో ఈ కుర్రాడు పాల్గొన్నాడు. అతని పెర్ఫార్మెన్స్ నచ్చడంతో ఎంపిక చేశారు. దీంతో జబర్దస్త్ షోలో ఎన్నో స్కిట్స్ చేసి నవ్వించాడు. జబర్దస్త్ లో చేస్తుండగానే సినిమాల్లో అనేక అవకాశాలు వచ్చాయి. తీస్కోలే రొండు లచ్చల కట్నం అనే డైలాగ్ తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. 2013లో తేజ దర్శకత్వంలో వచ్చిన వెయ్యి అబద్ధాలు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. కథని నడిపించే క్యారెక్టర్స్ చేసే స్థాయికి ఎదిగాడు. గద్దలకొండ గణేష్ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి అలరించిన ఈ కుర్రాడు.. శతమానం భవతి సినిమాలో ఆంధ్ర యాసలో కూడా మాట్లాడి అలరించాడు.

ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, నారప్ప, బలగం, భగవంత్ కేసరి, భీమా, ఓం భీమ్ బుష్ ఇలా అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. బలగం సినిమాలో ‘ఆగుతావా రెండు నిమిషాలు’ డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పటికైనా గుర్తుపట్టారా? అతను మరెవరో కాదు రచ్చ రవి. అతనెక్కడ ఉంటే అక్కడ రచ్చ ఉంటుంది. తన మాటలతో రచ్చ రచ్చ చేస్తాడు. తాజాగా తన ఇన్స్టా ఖాతాలో ఈ ఫోటోని షేర్ చేశాడు. ‘నటన అంటే ఇష్టంతో సినిమా రంగంలోకి రావాలన్న ఆశతో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు పేపర్లో ‘నటీనటులు కావలెను’ అనే ప్రకటన చూసి ఫోన్ కాల్ చేస్తే మీ ఫోటోను పంపించండి అన్నారు. నా రంగుల ప్రపంచం కోసం దిగిన నా మొదటి ఛాయాచిత్రం ఇది. అలనాటి నా మొదటి జ్ఞాపకం మీతో పంచుకోవాలని ఇలా……. శుభ సాయంత్రం మిత్రులారా………’ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి