కల్కి ట్రైలర్ లో ఇవి గమనించారా? మీ బుర్ర హీట్ ఎక్కి పోవడం ఖాయం!

Did You Notice These Points In Prabhas Kalki 2898 AD Movie Trailer: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు కథ ఏంటి? కల్కి సినిమాలో ఏం ఉండబోతోంది అనే విషయం కూడా అర్థమవుతోంది.

Did You Notice These Points In Prabhas Kalki 2898 AD Movie Trailer: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు కథ ఏంటి? కల్కి సినిమాలో ఏం ఉండబోతోంది అనే విషయం కూడా అర్థమవుతోంది.

ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. కల్కి 2898 ఏడీ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రభాస్ లుక్స్, ట్రైలర్ చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ట్రైలర్ లో ఈ విషయాలు గమనించారా? నాగ్ అశ్విన్ కథ చెప్పడం మాత్రమే కాకుండా.. ఆడియన్స్ కి చాలానే చిక్కు ముడులు వదిలిపెట్టాడు. వాటిని విప్పితే అసలు కథ అర్థమైపోయినట్లే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంతో లైటర్ వేలో ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్పాడు. అంటే కథ పరంగా ఎవరు ముఖ్యం? ఎవరు హీరో? ఎవరు విలన్? అనే విషయాలు స్పష్టంగా చెప్పేశారు.

ఈ కల్కి 2898 ఏడీ మూవీలో భైరవ పాత్ర చాలా లైటర్ వేలో ఉంటుంది. ప్రపంచంలో గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా పుష్కలంగా ఉండే కాంప్లెక్స్ లోకి వెళ్లాలి అనేది అతని ఆశయం. అందుకోసం బౌంటీ హంటర్ గా మారి తనకు వచ్చిన కాంట్రాక్టులను పూర్తి చేసి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. అయితే అతనికి వచ్చిన ఒక డీల్ భైరవ జీవితాన్నే మార్చేస్తుంది. అసలు యుద్ధంలోకి అప్పుడే అడుగుపెడతాడు. ఈ మూవీలో అసలు పాత్రలు నలుగురివి ఉన్నాయి. ఒకటి అశ్వత్థామ, రెండు దీపికా పదుకొణె, మూడు కమల్ హాసన్, నాలుగు కల్కి. అశ్వత్థామ పాత్ర పుట్టబోయే కల్కిని కాపాడటం. దీపికా పదుకొణె తన బిడ్డకు జన్మనివ్వడం, కమల్ హాసన్ మాత్రం ఆ బిడ్డను తాను పొందాలి అనుకుంటూ ఉంటాడు. అలాగే కమల్ హాసన్ కూడా సామాన్యుడిలా కనిపించడం లేదు. అశ్వత్థామ తరహాలోనే పురాణాల్లోని ఒక పాత్ర అయ్యే అవకాశం ఉంది.

కల్కికి ఉండే శక్తుల వల్ల అతను మంచి వాళ్ల చేతుల్లో పడితే లోక కల్యాణం జరుగుతుంది. అదే చెడ్డవాళ్లకు చిక్కితే విశ్వం వినాశనం జరుగుతుంది. అలాంటి మంచి- చెడుల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి భైరవ అడుగుపెడతాడు. తనకు వచ్చే యూనిట్స్ కోసం దీపికా పదుకొణెని పట్టించాలని ఫిక్స్ అవుతాడు. అయితే భైరవకు ఎదురుగా అశ్వత్థామ ఉంటాడు. పురాణాల ప్రకారం అశ్వత్థామ ఎన్నో శక్తులు కలిగిన వ్యక్తి. మనకు ట్రైలర్లో కూడా అదే చూపించారు. అలాగే భైరవకు టెక్నాలజీ మీద పట్టు ఉంది. కాబట్టి ఈ మూవీలో దైవం వర్సెస్ టెక్నాలజీ యుద్ధం కూడా చూసే ఛాన్స్ ఉంది. అశ్వత్థామ టీజర్, కల్కి ట్రైలర్ లో చూపించిన ఒక చిన్న కుర్రాడు కచ్చితంగా కల్కి అయ్యే ఛాన్స్ ఉంది.

ఈ కల్కిని రక్షించే బాధ్యత అశ్వత్థామ తీసుకున్నాడు. కానీ, ఆ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ భైరవ చేతుల్లో పడే అవకాశం లేకపోలేదు. అసలు ఏం జరుగుతోందో కూడా తెలియకుండా ఒక పెద్ద యుద్ధంలోకి భైరవ అడుగు పెట్టాడు. అంతా తెలిసిన తర్వాత అతను కచ్చితంగా కల్కిని కాపాడేందుకు ఒప్పుకుంటాడు. ఇప్పటికే భైరవ పిల్లలతో ఎంత బాగా ఉంటాడు ఆనే విషయాన్ని అప్ డేట్స్ రూపంలో చూపించారు. అంటే అశ్వత్థామ తర్వాత కల్కి బాధ్యత భైరవ తీసుకుంటాడు. అయితే ఫస్ట్ పార్ట్ లో కథ దాదాపుగా ఇంత వరకే ఉండచ్చు. ఫస్టాఫ్ అంతా భైరవ- కల్కి- అశ్వత్థామ- పద్మ పాత్రలను హైలెట్ చేస్తారు. ఆ తర్వాత కల్కిని చెడ్డవారి నుంచి ప్రొటెక్ట్ చేస్తూ అసలు యుద్ధంలోకి ప్రభాస్ ఎంటర్ అవుతాడు. అక్కడితోనే కల్కి 2898 ఏడీ మూవీ ఫస్ట్ పార్ట్ ముగిసే అవకాశం ఉంది. ఇంక సెకండ్ పార్ట్ లో అసలు కథ చూపిస్తారు అనే అభిప్రాయం కలుగుతోంది. మొత్తానికి ఈ మూవీతో హాలీవుడ్ ని షేక్ చేస్తారు అనే విషయం గట్టిగానే అర్థమవుతోంది.

Show comments