iDreamPost
android-app
ios-app

ఒకప్పుడు సాధారణ టీవీ యాంకర్.. ఇప్పుడు సౌత్‌లో టాప్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

  • Published May 09, 2024 | 5:41 PM Updated Updated May 09, 2024 | 5:41 PM

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా మారక ముందు.. మోడల్ అవతారం ఎత్తి యాడ్స్ చేస్తుంటారు, లేదా బుల్లితెరపై న్యూస్ యాంకర్స్ , సీరియల్ నటిగా అలరిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ ఫోటోలోని లేడీ యాంకర్.. ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా మారక ముందు.. మోడల్ అవతారం ఎత్తి యాడ్స్ చేస్తుంటారు, లేదా బుల్లితెరపై న్యూస్ యాంకర్స్ , సీరియల్ నటిగా అలరిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ ఫోటోలోని లేడీ యాంకర్.. ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

  • Published May 09, 2024 | 5:41 PMUpdated May 09, 2024 | 5:41 PM
ఒకప్పుడు సాధారణ టీవీ యాంకర్.. ఇప్పుడు సౌత్‌లో టాప్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

సినిమా రంగం మీద ఫ్యాషన్‌తో ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్లుగా మారక ముందు ఎన్నో స్ట్రగుల్ పడుతుంటారు. కొంత మంది మోడల్‌గా వివిధ ప్రకటనల్లో నటిస్తూ డబ్బులు సంపాదిస్తూ.. మరికొంత మంది న్యూస్ రీడర్లు, యాంకర్స్ లేదా బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ వెండితెర అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సమంత, నయనతార నేటి అనసూయ వరకు ఇలా ఎదిగిన వాళ్లే అన్న సంగతి విదితమే. ఇదిగో ఈ ఫోటోలో వార్తలు చదువుతున్న ఈ న్యూస్ యాంకరమ్మ కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్. వరుస పెట్టి సినిమా ఆఫర్లను కొల్లగొడుతోంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ ప్రియ భవానీ శంకర్. తమిళనాడులో 1989లో జన్మించిన ప్రియ భవానీ.. తొలుత న్యూస్ ప్రెజెంటర్‌గా వర్క్ చేసింది. పుతియ తలైమురైలో న్యూస్ చదివేది. ఆ తర్వాత తమిళ సీరియల్లో నటించింది. కళ్యాణ్ ముదల్ కాదల్ వరై ( హిందీ ఏ హై మొహబ్బతేన్) రీమేక్ ధారావాహికలో మెయిన్ రోల్ చేసింది. 2017లో వైభవ్ రెడ్డి హీరోగా వచ్చిన మేయదా మాన్ అనే చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దానికి ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డుకు ఎంపికైంది. ఆ తర్వాత కార్తీ సినిమాలో సెలక్ట్ అయ్యింది. కడై కుట్టి సింగం(చినబాబు)లో నటించింది. ఎస్ జే సూర్య సరసన మాన్ స్టర్‌లో మెప్పించింది.

ఓ మన్నేపిన్నే, బ్లడ్ మనీ, హాస్టల్, యానాయ్ వంటి చిత్రాల్లో నటించింది. ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి మూవీ తిరు చిత్రాంబలం (తెలుగులో తిరు) ఇందులో ధనుష్ చుట్టాలమ్మాయిగా నటించింది. తెరపై కనిపించేది కాసేపు అయినా.. తన నటనతో ఆకట్టుకుంది. అమ్మడు తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన కళ్యాణం.. కమనీయం మూవీతో తెలుగు నాట అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. గోపిచంద్ హీరోగా వచ్చిన భీమా సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. ఈ రెండింటీకి నడుమ నాగ చైతన్యతో రూపొందించిన ధూత వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. ఇందులో చైతూ భార్యగా, మోస్ట్ కరెప్టెడ్ జర్నలిస్టుగా కనిపిస్తుంది. శింబు పట్టుదల, లారెన్స్ రుద్రన్, విశాల్ రుద్రన్‌ కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్ స్టాయికి చేరుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో సత్యదేవ్ సరసన జీబ్రాతో పాటు ఇండియన్ 2, డీమాంట్ కాలనీ వంటి తమిళ సినిమాలను చేస్తుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss