iDreamPost
android-app
ios-app

ధోని ఫస్ట్ మూవీ ట్రైలర్! పెళ్లికి ముందే అలా చేయాలనే కాన్సెప్ట్ తో..

  • Author ajaykrishna Updated - 09:54 AM, Tue - 11 July 23
  • Author ajaykrishna Updated - 09:54 AM, Tue - 11 July 23
ధోని ఫస్ట్ మూవీ ట్రైలర్! పెళ్లికి ముందే అలా చేయాలనే కాన్సెప్ట్ తో..

ఎంఎస్ ధోని.. ఈ పేరుకు ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ పరిచయం అక్కర్లేదు. వరల్డ్ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ధోని అనేది ఓ పేరు కాదు.. మా ఎమోషన్ అంటూ ఫ్యాన్స్ కేరింతలు జేజేలు కొడుతుంటారు. అయితే.. క్రికెట్ లెజెండ్ అనిపించుకున్న ధోని.. రీసెంట్ గా ఎంటర్టైన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి.. LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే మూవీ నిర్మించాడు. ప్రెజెంట్ ఆ సినిమా రిలీజ్ కి రెడీ అయిపోయింది. ముందుగా తమిళంలో తెరకెక్కిన ఈ LGM మూవీ.. తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ఇందులో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా జంటగా నటించారు.

ఇక ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా.. దీనికి సంబంధించి ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మూవీ టీమ్. తాజాగా చెన్నైలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి ధోని తన ఫ్యామిలీతో సహా పాల్గొనడం విశేషం. మరి ధోని వస్తున్నాడు అంటే ఫ్యాన్స్ హడావిడి ఎలా ఉంటుందో తెలుసు కదా! అందులోనూ చెన్నైలో అంటే చెప్పక్కర్లేదు. మొత్తానికి ధోని లాంచ్ చేసిన LGM ట్రైలర్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రేమించుకున్న ఓ జంట.. తమ ఫ్యామిలీస్ ని ఎలా ఒప్పించి ఒక్కటయ్యారు అనే పాత కాన్సెప్ట్ తో వచ్చినా.. ఇందులో పెళ్లికి ముందు అత్తను అర్ధం చేసుకోవాలి? అత్తకోడలు ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి ఎలాంటి ఐడియా వేశారు? అనేది మిగతా కథ.

ఓ రకంగా బొమ్మరిల్లులో హీరోయిన్ టూర్ కి వెళ్తున్న అని చెప్పి.. హీరో ఫ్యామిలీతో వారం పాటు ఎలా ఉంటుందో.. ఇందులో ఇద్దరి ఫ్యామిలీస్ కలిసి ఒకే ట్రిప్ కి వెళ్లడం కొత్తగా ఉంది. పెళ్లికి ఏదైనా అక్కడే తేలిపోతుంది అనేది చాలా ఫన్ గా చూపించారు. హీరోయిన్ కి అత్త క్యారెక్టర్ లో నదియా నటించింది. ఈ సినిమాకు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రెండూ ఒక్కడే హ్యాండిల్ చేశాడు. అతని పేరు రమేష్ తమిళ మణి. ఇప్పటికైతే తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. మరి వీలైనంత త్వరగా తెలుగు ట్రైలర్ కూడా రానుందట. మరి ఇటీవల బ్లాక్ బస్టర్ అయిన లవ్ టుడే మాదిరి LGM కూడా ఆ వైబ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా ధోని భార్య సాక్షి వ్యవహరించినట్లు తెలుస్తుంది. మరి LGM ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom