iDreamPost
android-app
ios-app

విజయ్ GOAT మూవీలో మహేంద్ర సింగ్ ధోని? ఇక బాక్సాఫీస్ ఊచకోతే!

  • Published Aug 21, 2024 | 3:56 PM Updated Updated Aug 21, 2024 | 3:56 PM

MS Dhoni, Vijay Thalapathy, The GOAT Movie: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని.. ప్రొడక్షన్ హౌజ్‌తో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అది ఎంత వరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం..

MS Dhoni, Vijay Thalapathy, The GOAT Movie: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని.. ప్రొడక్షన్ హౌజ్‌తో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అది ఎంత వరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 21, 2024 | 3:56 PMUpdated Aug 21, 2024 | 3:56 PM
విజయ్ GOAT మూవీలో మహేంద్ర సింగ్ ధోని? ఇక బాక్సాఫీస్ ఊచకోతే!

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ది గోట్‌. ఇటీవలె ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాపై ఆరంభం నుంచి భారీ అంచనాలున్నా.. ట్రైలర్‌తో అవి మరింత పెరిగాయి. వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం.. విజయ్‌ అభిమానులతో పాటు.. సగటు సినీ అభిమాని సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌తో సినిమా కథపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు. అలాగే ట్రైలర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని రిఫరెన్సులు ఫుల్‌గా ఉన్నాయి. దాంతో ధోని, సీఎస్‌కే అభిమానులకు కూడా ఈ ట్రైలర్‌ తెగ నచ్చేసింది.

ట్రైలర్‌ రిలీజ్‌ సమయంలో.. సినిమాలో ధోనితో పాటు సీఎస్‌కే రిఫరెన్సులో బోలెడులు ఉంటాయని డైరెక్టర్‌ వెంటక్‌ ప్రభు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా హీరో విజయ్‌తో ధోని కలిసున్న ఓ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ పిక్‌తో.. ధోని గోట్‌ మూవీలో నటిస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే కనుక జరిగితే.. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమంటూ సినీ, క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. విజయ్‌-ధోని కాంబో సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపిస్తే.. రికార్డు కలెక్షన్లు కురుస్తాయని ట్రేడ్‌ వర్గాలు కూడా అభిప్రాయాపడుతున్నాయి.

మరోవైపు.. ధోని మూవీలో నటించలేదని.. ఒక వేల ప్రమోషన్స్‌లో భాగంగా ఏమైనా పాల్గొని ఉండొచ్చిన కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు ముందుగా చెప్పినట్లు ధోని, సీఎస్‌కే రిఫరెన్సులు ఎక్కువగా ఉండే ఈ మూవీ ప్రమోషన్స్‌లో ధోని పాల్గొని ఉండొచ్చని అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం గోట్‌ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో ఉంది. సినిమాను సెప్టెంబర్‌ 5న రిలీజ్‌ చేసే ప్లాన్‌తో మేకర్స్‌ ఉన్నట్లు సమాచారం. మరి విజయ్‌తో ధోని ఉన్న ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş