iDreamPost
android-app
ios-app

Dhanush: ధనుష్ డెడికేషన్.. మాస్కు కూడా లేకుండా 10 గంటలు డంప్ యార్డ్ లోనే!

  • Published May 06, 2024 | 4:06 PM Updated Updated May 06, 2024 | 4:06 PM

హీరో ధనుష్ కు తమిళనాట, తెలుగు నాట ఎంత పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ధనుష్ శేఖర్ కమ్ములతో కలిసి కుభేర సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజి అప్ డేట్ వచ్చింది. అదేంటో చూసేద్దాం..

హీరో ధనుష్ కు తమిళనాట, తెలుగు నాట ఎంత పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ధనుష్ శేఖర్ కమ్ములతో కలిసి కుభేర సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజి అప్ డేట్ వచ్చింది. అదేంటో చూసేద్దాం..

  • Published May 06, 2024 | 4:06 PMUpdated May 06, 2024 | 4:06 PM
Dhanush: ధనుష్ డెడికేషన్.. మాస్కు కూడా లేకుండా 10 గంటలు డంప్ యార్డ్ లోనే!

ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల చిత్రాలకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటారు…. ఓ విధంగా ఫీల్ గుడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల అని చెప్పి తీరాల్సిందే. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కుబేర అనే సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. అలాగే ఈ సినిమా నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. సినిమా టైటిల్ కు ధనుష్ లుక్ కు సంబంధించి ఇప్పటికే రకరకాల ప్రశ్నలు అందరికి పుట్టుకొచ్చేస్తున్నాయి. అందులోను శేఖర్ కమ్ముల డైరెక్షన్ అంటే అందరికి ముందే కొన్ని అంచనాలు ఉంటాయి. దీనితో ఈ సినిమా గురించి కూడా అందరికి అలాంటి ఎక్స్పెక్టషన్స్ ఏ ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు కుబేర సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేస్తుంది.

సాధారణంగా తెరపైన హీరోల నటనను చూసి అందరు మెచ్చుకుంటూ ఉంటారు. కానీ తెర వెనుక వారు ఎలాంటి కష్టాలు పడుతున్నారు అనేది మాత్రం ఎవరికీ కనిపించదు. కొంతమంది హీరోలు తమ పాత్ర కోసం ఎంతో బాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంటారు. ఈ క్రమంలో ధనుష్ కూడా కుబేర సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం.. ఎంతో కష్టపడ్డాడు. అదేంటంటే.. ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం.. ముంబైలోని ఓ భారీ డంప్ యార్డ్ లో సినిమా షూటింగ్ ను ప్లాన్ చేశారట మేకర్స్. ఆ ప్రదేశంలో ధనుష్ దాదాపు 10 గంటల పాటు.. కనీసం మాస్క్ కూడా లేకుండా ఆ షూటింగ్ లో పాల్గొన్నారట. సన్నివేశాలు సహజంగా రావడం కోసం ధనుష్ ఇలా చేసారని.. మూవీ మేకర్స్ ధనుష్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు సినిమాపై ధనుష్ కు ఉన్న డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇప్పటికే విడుదల చేసిన లుక్ ను బట్టి అర్ధం చేసుకోవచ్చు.. ధనుష్ ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నరని.. ఫస్ట్ లుక్ కీ భారీ స్పందన లభించడంతో పాటు.. సినిమాపైన ఆసక్తిని కూడా పెంచేసింది. ధనుష్ తర్వాత.. మరోవైపు ఈ సినిమా నుంచి నాగార్జున లుక్ ను కూడా తాజాగా రివీల్ చేశారు మేకర్స్. మరి శేఖర్ కమ్ముల ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం ధనుష్ కు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş